- Telugu News Photo Gallery Cinema photos This Actress Wanted To Be a Boxer, and Trained In Martial Arts, Now She Is Tollywood Crazy Heroine Ritika Singh
Tollywood : బాక్సర్ కావాల్సిన అమ్మాయి.. మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకుని సినిమాల్లోకి.. ఇప్పుడు ఆఫర్స్ కోసం..
క్యూట్‌గా అమాయకంగా కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. తెలుగు, తమిళం భాషలలో వరుస ఆఫర్స్ అందుకుంటూ అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. ప్రొఫెషనల్ బాక్సార్ కావాల్సిన అమ్మాయి ఇప్పుడు ఇండస్ట్రీలో ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది.
Updated on: Apr 09, 2025 | 12:01 PM

తెలుగులో క్రేజీ హీరోయిన్. తెలుగు, తమిళం, హిందీ భాషలలో నటించి మెప్పించింది. అందం, అభినయంతో కట్టిపడేసింది. సిల్వర్ స్క్రీన్ పై అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ అమ్మడు మంచి కిక్ బాక్సర్. తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తూ చిన్నతనం నుంచే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకుంది.

ఆమె మరెవరో కాదు.. రితికా సింగ్. విక్టరీ వెంకటేశ్ సరసన గురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత దక్షిణాదిలో వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీ హీరోయిన్ గా మారింది.

చిన్నప్పటి నుంచి కిక్ బాక్సింగ్ లో శిక్షణ తీసుకున్న రితికా సింగ్.. బాక్సింగ్ నేపథ్యంతో వచ్చిన సాలా ఖదూస్ మూవీతో కథానాయికగా మారింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. తమిళంలో ఇరుడి సుట్రు పేరుతో రీమేక్ అయ్యింది.

ఆ తర్వాత విక్టరీ వెంకటేశ్ సరసన గురు సినిమాలో కనిపించింది. ఆ తర్వాత విజయ్ సేతుపతి సరసన ఆండవన్ కట్టలై మూవీలో కనిపించింది. అలాగే రాఘవ లారెన్స్ సరసన శివలింగ మూవీలో కనిపించింది రితిక. ప్రస్తుతం సరైన ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తుంది రితిక.

గురు తర్వాత తెలుగులో మరె సినిమాలో కనిపించలేదు రితిక. కేవలం నీవెవ్వరో సినిమాలో కనిపించింది. ఇక చివరిసారిగా రితిక రజినీకాంత్ వెట్టయాన్ సినిమాలో కనిపించింది. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది.




