అచ్చం కవలపిల్లల్లా ఉండే హీరోయిన్స్ వీరే!
టాలీవుడ్‌లో ఎంతో మంది నటీమణులు ఉన్నారు. ఇందులో చాలా మంది హీరోయిన్స్ తమ అందం,నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కొందరు హీరోయిన్స్ తమ సిస్టర్స్‌ను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తే మరికొందరు వారి అక్కచెల్లెల్లను ఇండస్ట్రీకి దూరంగానే ఉంచుతున్నారు. అయితే ఇండస్ట్రీలో ఉన్నా లేకపోయినా, అచ్చం కవల పిల్లల్లా ఉండే ముద్దుగుమ్మలు కొందరు ఉన్నారు. వారు ఎవరో ఇప్పుడు మనం చూద్దాం.
Updated on: Mar 24, 2025 | 12:37 PM

సీనియర్ నటుడు విజయ్ కుమార్ కూతర్లలో శ్రీదేవి, తన చిన్న కూతురు ప్రీతి ఇద్దరూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తమ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరూ అచ్చం కవలపిల్లల్లానే కనిపిస్తారు.

తండేల్ మూవీతో పాన్ ఇండియా లెవల్‌లో మంచి సక్సెస్ అందుకున్న ముద్దుగుమ్మ సాయిపల్లవి. ఈ హీరోయిన్ చెల్లెలు పూజ. వీరిద్దరూ కూడా అచ్చం కవల పిల్లల్లానే కనిపిస్తారు. కానీ సాయిపల్లవి చెల్లి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వలేదు.

చందమామ సినిమాతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చి, మగధీర సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ముద్దుగుమ్మ కాజల్. ఈ బ్యూటీ చెల్లి నిషా అగర్వాల్ కూడా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. వీరిద్దరూ కూడా కవల పిల్లలానే కనిపిస్తారు.

సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ కూతర్లు శృతి హాసన్, అక్షర హాసన్ కూడా చూడటానికి అచ్చం కవల పిల్లల్లానే ఉంటారు. కానీ కొంచెం హైట్‌లో మాత్రమే తేడా ఉంటుంది.

అదే విధంగా ఊర్వసి, కల్పన సీనియర్ హీరోయిన్స్ వీరు కూడా చూడటానికి అచ్చం కవలల్లానే కనిపిస్తారు.





























