- Telugu News Photo Gallery Cinema photos Tamil Actress Trupti Ravindra Debut Vijay Antony Shakthi Thirumagan
Actress: కొత్త హీరోయిన్ వచ్చిందిరోయ్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న భద్రకాళి బ్యూటీ..
దక్షిణాదిలోకి నిత్యం కొత్త హీరోయిన్స్ వస్తుంటారు. కొందరు ఏళ్ల తరబడి వరుస సినిమాలతో అలరిస్తుంటారు. అయినప్పటికీ సరైన బ్రేక్ మాత్రం అందుకోలేరు. కానీ కొందరు ముద్దుగుమ్మలు ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అవుతుంటారు. ఇప్పుడు ఒక హీరోయిన్ మాత్రం ఫస్ట్ మూవీ రిలీజ్ కాకుండానే సెన్సేషన్ అవుతుంది.
Updated on: Sep 15, 2025 | 5:33 PM

ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్ వచ్చేసింది. ఆమె నటించిన సినిమా విడుదల కాకుండానే సోషల్ మీడియాలో తెగ సెన్సేషన్ అవుతుంది. ఇప్పుడు ఈ అందానికి సంబంధించిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ పేరు తృప్తి రవీంద్ర. కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని నటించి నిర్మించిన శక్తి తిరుమగన్ (భద్రకాళి )సినిమాతో కథానాయికగా పరిచయం కాబోతుంది. ఈ సినిమా సెప్టెంబర్ 19న విడుదల కానుంది.

మహారాష్ట్రలోని ధూలే నగరానికి చెందిన ఈ బ్యూటీ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదట్లో స్టేజ్ ఆర్టిస్టుగా చేసింది. ఐదేళ్లపాటు నాటకాల్లో కనిపించిన ఆమె.. ఇప్పుడిప్పుడే వాణిజ్య ప్రకటనలలో కనిపించింది.

డ్యాన్స్, యోగ వంటి వాటిలోనూ ప్రావీణ్యం ఉంది. ఈ చిరంలో నటిస్తున్న సమయంలో తృప్తి తమిళ భాషను నేర్చుకోవడం విశేషం. విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించి నిర్మించారు.

థియేటర్ నాటకాల ద్వారా నటనలో శిక్షణ పొందినట్లు చెప్పింది. దర్శకుడు అరుణ్ ప్రభు, విజయ్ ఆంటోనితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని పేర్కొంది.




