- Telugu News Photo Gallery Cinema photos Actress Kriti Sanon First Tattoo Shares Photos and Said Meaning about Flying Bird Tattoo
Kriti Sanon: హీరోయిన్ కాలిపై సరికొత్త టాటూ.. అర్థం చెప్పేసిన కృతి సనన్.. ఫోటోస్ వైరల్..
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈబ్యూటీకి తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. తెలుగులో సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన 1 నేనొక్కడినే చిత్రంలో నటించింది. ఇందులో మహేష్ బాబు హీరోగా నటించారు. ప్రస్తుతం హిందీలో సెటిల్ అయ్యింది.
Updated on: Sep 15, 2025 | 6:30 PM

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు హిందీలో సెటిల్ అయిన భామ.. ముందుగా తెలుగులోనే నటించింది. మహేష్ బాబు, సుకుమార్ కాంబోలో వచ్చిన 1 నేనొక్కడినే చిత్రంతో నటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ షిఫ్ట్ అయ్యి అక్కడే వరుస సినిమాల్లో నటిస్తుంది.

తెలుగులో నాగచైతన్యతో దోచేయ్, ప్రభాస్ తో రామాయణం చిత్రాల్లో నటించింది. కానీ ఎక్కువగా హిందీలోనే నటిస్తుంది ఈ అమ్మడు. తాజాగా తన కాలిపై టాటూ వేయించుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ షేర్ చేస్తూ ఆ టాటూ మీనింగ్ కూడా చెప్పేసింది.

కృతి సనన్ ఇప్పటివరకు ఒంటిపై ఒక్క టాటూ వేయించుకోలేదట. కానీ మొదటిసారి ఒక టాటూ వేయించుకుంది. తన కాలు మీద ఎగిరే పక్షి టాటూగా వేయించుకుంది. అంతేకాకుండా ఈ టాటూ కింద ఆసక్తికర కొటేషన్ రాసుకొచ్చింది ఈ అమ్మడు.

నేను కూడా టాటూ వేయించుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ మొదటిసారి టాటూ వేయించుకున్నాను. ఇన్నాళ్లకు నా వాగ్దానం నెరవేరింది. పక్షిలాగే నేను కూడా సూర్యొదయంలో ఎగురుతూ స్వేచ్ఛా జీవితాన్ని గడపాలని చూస్తున్నాను.

కళ్లతో కలుల కంటున్న ఎవరైనా సరే మీరు భయపడే ఆ ఎత్తును తీసుకోండి. ఇది సులభం కాకపోవచ్చు. కానీ మీరు మీ మార్గాలను కనుగొంటారు. ఎగరడం నేర్చుకుంటారు. జీవితంలో ముందడుగు వేయాలి అనే లక్ష్యంతో ఆ టాటూ వేయించుకున్నట్లు చెప్పుకొచ్చింది.




