- Telugu News Photo Gallery Cinema photos Pooja Hegde's Career Despite Flops, New Telugu and Hindi Projects
Pooja Hegde: ఫ్లాపుల్లోనూ టాప్ లేపేస్తున్న హీరోయిన్
ఈ రోజుల్లో ఒకట్రెండు ఫ్లాపులు వస్తేనే ఆ హీరోయిన్‌ను తీసి పక్కనబెడుతుంటారు దర్శకులు. కానీ ఇక్కడో హీరోయిన్‌కు మాత్రం ఎక్కడో లక్ ఉంది. అందుకే మూడేళ్లుగా ఫ్లాపులున్నా అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్స్ అందుకుంటూ.. మిగిలిన హీరోయిన్లకు అర్థం కాని ఫజిల్‌గా మారిపోయింది ఈ బ్యూటీ. ఇంతకీ ఎవరా హీరోయిన్..?
Updated on: Sep 15, 2025 | 8:10 PM

పూజా హెగ్డేకు సరైన హిట్ వచ్చి మూడేళ్లు దాటిపోయింది.. కమిటైన సినిమాలు ఆగిపోవడం.. విడుదలైన సినిమాలు ఆడకపోవడంతో అమ్మడి కెరీర్ డైలమాలో పడింది. టాలీవుడ్ పట్టించుకోకపోవడంతో తమిళం, హిందీపై ఫోకస్ చేస్తున్నారు పూజా.

అక్కడ్నుంచి ఆదరణ బాగానే ఉంది. అక్కడ కూడా పూజా నటించిన రెట్రో, కూలీ సినిమాలు అంచనాలు అందుకోలేదు. తమిళంలో బిజీగానే ఉన్నారు పూజా. విజయ్ జన నాయగన్ సినిమాతో పాటు కాంచన 4లో నటిస్తున్నారు.

వీటితో కమ్ బ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హిందీలోనూ ఆఫర్స్ పర్లేదు. తెలుగులో మాత్రమే ఈమె కాస్త వెనకబడి ఉన్నారు. తాజాగా ఆ లోటు కూడా తీరిపోయింది. ఇక్కడ దుల్కర్ సల్మాన్ సినిమాలో అవకాశం వచ్చింది.

విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో నితిన్ హీరోగా ఓ స్పోర్ట్స్ డ్రామా రెడీ అవుతుంది. ఇందులో కూడా హీరోయిన్‌గా పూజా హెగ్డేను తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

ఇష్క్ తర్వాత విక్రమ్, నితిన్ కాంబినేషన్‌లో రానున్న సినిమా ఇది. దాంతో పాటు హిందీలో హై జవానీతో ఇష్క్ హోనా హై సినిమాలో నటిస్తున్నారు. వెబ్ సిరీస్‌లకు కూడా ఓకే అంటున్నారు పూజా.




