- Telugu News Photo Gallery Cinema photos Manchu Manoj's Miraai Success Overcoming Family Feuds and Career Slump
Manchu Manoj: పాపం మంచు వారి అబ్బాయికి అన్ని కష్టాలా ?? కన్నీరు పెట్టుకున్న మనోజ్
కొన్నాళ్లుగా కుటుంబంలో గొడవలు.. కెరీర్ పరంగా ఇబ్బందులు.. చేసిన సినిమాలేమో ఫ్లాపులు.. ఇలాంటి సమయంలో మంచు మనోజ్ టైమ్ ఇన్నాళ్లకు స్టార్ట్ అయిందా..? మిరాయ్‌తో మనోజ్ 2.0 లా కనిపించారు..? స్టేజ్ మీద మరీ అంతగా ఎమోషనల్ అయ్యేంతగా మంచు వారసుడికి కష్టాలు ఏమున్నాయి..? చూద్దాం డీటైల్డ్‌గా ఈ స్టోరీలో..
Updated on: Sep 15, 2025 | 8:14 PM

వింటున్నారుగా మనోజ్ ఏమంటున్నారో.. నిజంగానే ఇన్నాళ్లూ మంచు వారబ్బాయి ఇన్ని కష్టాల్లో ఉన్నాడని చాలా మందికి తెలియదు. మిరాయ్ సక్సెస్ ఎవరికి ఎంత ఉపయోగపడుతుందో తెలియదు కానీ మనోజ్‌కు మాత్రం ఊపిరి పోసింది.

తననే కాదు.. తన కుటుంబాన్నే కాపాడింది ఈ సినిమా అంటూ కన్నీరు పెట్టుకున్నారు మనోజ్. దీన్నిబట్టి ఈ సినిమా అతడికి ఎంత కీలకమో అర్థమైంది. చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత ఈ మధ్యే భైరవం సినిమాలో విలన్‌గా నటించారు మనోజ్.. కానీ అది వర్కవుట్ కాలేదు.

ఇప్పుడు మిరాయ్‌తో ప్యాన్ ఇండియన్ యాక్టర్ అయిపోయారు. మనోజ్ సపోర్టింగ్ రోల్స్ చేస్తే ఆఫర్స్ క్యూ కడతాయి. పైగా మంచి పర్ఫార్మర్ కూడా..! ఇన్నాళ్లూ వ్యక్తిగత కారణాలతో కెరీర్‌పై ఫోకస్ చేయని మనోజ్.. ఇకపై వరసగా సినిమాలు చేస్తానంటున్నారు.

ఆ మధ్య కుటుంబంతో విభేదాల నేపథ్యంలో అన్న విష్ణు నటించిన కన్నప్ప సినిమాపై సెటైర్లు కూడా వేసారు మనోజ్. కానీ ఇప్పుడు అదే విష్ణు మిరాయ్ టీంకు ఆల్ ది బెస్ట్ అని ట్వీట్ చేస్తే.. థ్యాంక్యూ అన్న అని రిప్లై ఇచ్చి ప్రేమను చూపించారు మనోజ్.

మొత్తానికి ఇటు ప్రొఫెషనల్, అటు పర్సనల్‌గా కరెక్ట్ రూట్‌లోనే ఉన్నారీయన. మరి ఈ సక్సెస్ అన్నాదమ్ములను కూడా కలుపుతుందేమో చూడాలి.




