- Telugu News Photo Gallery Cinema photos Super Star Rajinikanth 60 crore remuneration for coolie movie Telugu Heroes Photos
Rajinikanth: వరుస సినిమాలతో రజినీకాంత్ దూకుడు.. అవాక్కయ్యేలా రెమ్యూనిరేషన్.
పాపం రోజంతా చెమటోడ్చేలా కష్టపడినా కూలీలకి దక్కేది వందల్లోనే..! కానీ అది బయటి కూలీలకు.. ఇక్కడో ఇంటర్నేషనల్ కూలీ ఉన్నాడు. ఆయన పని చేస్తే ఆస్తులు రాసివ్వాలి.. జీతం కోట్లలో ఇవ్వాలి. పని చేసినందుకు.. చేయించినందుకు ఇద్దరూ రికార్డ్ స్థాయిలో తీసుకుంటున్నారు. ఇంతకీ ఎవరా కూలీలు..? వాళ్లకెందుకు అంత డిమాండ్..? ఊరు కాదు.. ఏకంగా ప్రపంచం మొత్తం మెచ్చిన పనివాడు కాబట్టే రజినీకాంత్‌కు ఈ రేంజ్ క్రేజ్ సొంతం.
Updated on: May 17, 2024 | 5:22 PM

తన మార్కెట్ తగ్గిందేమో.. ఒకప్పట్లా తన సినిమాలు ఆడియన్స్ చూడట్లేదేమో అనే అనుమానాలు సూపర్ స్టార్‌లోనూ జైలర్‌కు ముందు వచ్చుంటాయి.. కానీ ఒక్క హిట్‌తో మ్యాటర్ సెటిల్ అయిపోయింది.

ఏం ప్రాబ్లమ్ లేదు.. మనల్ని ఇంకా ఆడియన్స్ కావాలయ్యా అంటున్నారని రజినీకి కూడా క్లారిటీ వచ్చేసింది. వరస సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు రజినీ. ప్రస్తుతం జై భీమ్ ఫేమ్ జ్ఞానవేల్‌తో పాటు లోకేష్ కనకరాజ్ సినిమాలు చేస్తున్నారు.

73 ఏళ్ళ వయసులోనూ సూపర్ స్టార్ డమ్‌తో పిచ్చెక్కిస్తున్నారకు సూపర్ స్టార్. ఇప్పటికీ వరస సినిమాలు చేస్తూ రేసులో దూసుకుపోతున్నారు రజినీ. ప్రస్తుతం వెట్టైయాన్ షూట్ పూర్తి చేసిన రజినీ..

తాజాగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న కూలీలోనూ క్యాస్టింగ్ మామూలుగా లేదు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో శివ కార్తికేయన్, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించబోతున్నట్లు తెలుస్తుంది. జులై 1 నుంచి కూలీ షూటింగ్ మొదలు కానుంది. మొత్తానికి జైలర్ నుంచి కాస్టింగ్‌పై ఫోకస్ పెంచేసారు రజినీ.

ఈ రెండు సినిమాల కాస్టింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు రజినీ. జైలర్‌లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్స్ ఉన్నారు. వెట్టైయాన్‌లోనూ అమితాబ్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, మంజు వారియర్ లాంటి స్టార్స్ ఉన్నారు.

జైలర్‌కు వర్కవుట్ అయిన ఆ ఫార్ములానే నెక్ట్స్ సినిమాల్లోనూ కంటిన్యూ చేస్తున్నారు సూపర్ స్టార్. మరి రజినీకాంత్ తీసుకుంటున్న ఆ జాగ్రత్తలేంటి..? జైలర్ సక్సెస్ తర్వాత రజినీకాంత్‌లో జోష్ పదింతలు పెరిగిపోయింది.




