Samyuktha Menon: మహిళలకు సమాన అవకాశాలు కల్పించి వారిని అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడపాలనే లక్ష్యంతో ఆదిశక్తి సంస్థను ప్రారంభించానని అన్నారు నటి సంయుక్త. అన్ని వయసుల మహిళలకు ఈ సంస్థ చేయూతనిస్తుందని చెప్పారు. విద్య, ఉపాధి, శిక్షణ, ఆరోగ్యం వంటి విషయాల్లో మహిళలకు సపోర్ట్ గా నిలుస్తామని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో తమ గొంతు వినిపించాలనేది ఆదిశక్తి సంస్థ ఉద్దేశమని చెప్పారు.