- Telugu News Photo Gallery Cinema photos Nara rohit sundarakanda nithiin Robinhood movies release date fix
Tollywood News: నారా రోహిత్ నయా సుందరకాండ | రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన ‘రాబిన్ హుడ్’
నారా రోహిత్ హీరోగా నటిస్తున్న 20వ సినిమాకు సుందరకాండ అనే పేరు పెట్టారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. సెప్టెంబర్ 6న థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించారు. ప్రతి వ్యక్తికి రిలేట్ అయ్యేలా కథ ఉంటుందని చెప్పారు. అన్ని రకాల ఎమోషన్స్ ని చూపించామని, తప్పక నచ్చుతుందని అన్నారు మేకర్స్. నితిన్ హీరోగా నటిస్తున్న సినిమా రాబిన్ హుడ్. నితిన్ గెటప్ నుంచి కేరక్టరైజేషన్ వరకు ప్రతిదీ డిఫరెంట్‌గా ఉంటుంది.
Updated on: Apr 18, 2024 | 9:30 PM

Nara Rohit: నారా రోహిత్ హీరోగా నటిస్తున్న 20వ సినిమాకు సుందరకాండ అనే పేరు పెట్టారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. సెప్టెంబర్ 6న థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించారు. ప్రతి వ్యక్తికి రిలేట్ అయ్యేలా కథ ఉంటుందని చెప్పారు. అన్ని రకాల ఎమోషన్స్ ని చూపించామని, తప్పక నచ్చుతుందని అన్నారు మేకర్స్

Nithiin: నితిన్ హీరోగా నటిస్తున్న సినిమా రాబిన్ హుడ్. నితిన్ గెటప్ నుంచి కేరక్టరైజేషన్ వరకు ప్రతిదీ డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ సినిమాను డిసెంబర్ 20న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మైత్రీ మూవీ మేకర్స్. క్రిస్మస్ సెలవులు, న్యూ ఇయర్ సెలవులు తమ సినిమాకు కలిసి వస్తాయని అన్నారు.

Bellamkonda Sai Sreenivas: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఓ సినిమాకు సంతకం చేశారు. సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అబ్బురపరిచే కథతో సాంకేతికంగా అద్భుతమైన టీం తో కలిసి సరిహద్దులను పుష్ చేయబోతున్నట్టు ప్రకటించారు నిర్మాత సాహు గారపాటి.

Teacher: కలర్స్ స్వాతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా టీచర్. తెలంగాణలోని ఓ మారుమూల పల్లెకు చెందిన ముగ్గురు అల్లరి కుర్రాళ్ల జీవితం ఓ టీచర్ పరిచయంతో ఎలా మారిందనే ఆసక్తికరమైన కథతో తెరకెక్కుతోంది. 90స్ ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ ఫేమ్ ఆదిత్య హసన్ దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ మేడారం నిర్మిస్తున్నారు.

Osey Arundhati: మోనికా చౌహాన్, కమల్ కామరాజు, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ఒసేయ్ అరుంధతి. ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. లేటెస్ట్ గా విడుదలైన పాటకు నెట్టింట్లో మంచి స్పందన వస్తోంది. కుటుంబసమేతంగా చూడదగ్గ సినిమా అని అన్నారు మేకర్స్.




