- Telugu News Photo Gallery Cinema photos Spy movie actress Iswarya Menon latest beautiful photos goes viral telugu cinema news
Iswarya Menon: అందం హిందోళం.. అదిరే ఐశ్వర్య మీనన్.. పట్టు చీరలో సుందరి హోయలు..
ఇటీవల తెలుగు తెరపై తమిళ్, మలయాళీ హీరోయిన్స్ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో కొందరు స్టార్ హీరోయిన్లుగా వరుస అవకాశాలు అందుకోగా.. మరికొందరు ఒకటి, రెండు చిత్రాలతో సరిపెట్టుకుంటున్నారు. ఇక ఇప్పుడు మరికొందరు అందాల ముద్దుగుమ్మలు వెండితెరపై ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు. అందులో ఐశ్వర్య మీనన్ ఒకరు.
Updated on: May 20, 2023 | 8:47 PM

ఇటీవల తెలుగు తెరపై తమిళ్, మలయాళీ హీరోయిన్స్ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో కొందరు స్టార్ హీరోయిన్లుగా వరుస అవకాశాలు అందుకోగా.. మరికొందరు ఒకటి, రెండు చిత్రాలతో సరిపెట్టుకుంటున్నారు.

ఇక ఇప్పుడు మరికొందరు అందాల ముద్దుగుమ్మలు వెండితెరపై ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు. అందులో ఐశ్వర్య మీనన్ ఒకరు.

టీనేజ్ లోనే ఈ బ్యూటీ కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. చక్కని కనుముక్కుతీరుతో ఆకట్టుకున్న ఈ సుందరి, కోలీవుడ్ లో ఒక రేంజ్ లో దూసుకుపోతుందని అనుకున్నారు.

కానీ అనుకున్నంత స్పీడ్ గా అయితే ఆమె తన కెరియర్ గ్రాఫ్ ను పరిగెత్తించలేకపోయింది. కాకపోతే కన్నడ సినిమాలు ఎక్కువగానే చేసింది.

పదేళ్ల కెరియర్ లో ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు. ఇక ఇప్పుడు తెలుగు తెరకు పరిచయం కాబోతుంది.

ఐశ్వర్య మీనన్ ఇప్పుడు నిఖిల్ 'స్పై' సినిమాతో తెలుగు తెరకి పరిచయమవుతోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇందులో నిఖిల్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటిస్తుడంగా.. ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి.

తాజాగా ఈ బ్యూటీ లేటేస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి..




