- Telugu News Photo Gallery Cinema photos Sobhita Dhulipala Intresting Post About Her Husband Naga Chaitanya Thandel Movie
Sobhita Dhulipala: చైతన్య పై ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసిన శోభిత.. చాలా రోజుల తర్వాత నీ ముఖం చూస్తా సామీ అంటూ..
మోస్ట్ అవైటెడ్ మూవీ నాగ చైతన్య హీరోగా నటించిన లేటేస్ట్ మూవీ తండేల్. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కథానాయికగా నటించింది. ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఉదయం నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.
Updated on: Feb 07, 2025 | 1:51 PM

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా తండేల్. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా చైతూ సతీమణి శోభితా ఆసక్తికర పోస్ట్ చేసింది.

తన ఇన్ స్టా స్టోరీలో తండేల్ పోస్టర్ షేర్ చేస్తూ చైతన్య గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తండేల్ మూవీ రిలీజ్ పై ఆనందం వ్యక్తం చేస్తూ తాను చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పారు.

ఈ సినిమా మేకింగ్ సమయంలో మీరు చాలా ఫోకస్, పాజిటివ్ గా ఉండడం నేను చూశాను. ఈ అద్భుతమైన ప్రేమకథా చిత్రాన్ని అందరితోపాటు నేను కూడా చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

ఫైనల్లీ గడ్డం షేర్ చేస్తావు. మొదటి సారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ అని పేర్కొన్నారు. దీనిపై చైతన్య స్పందిస్తూ థాంక్యూ బుజ్జితల్లి అని అన్నారు. ప్రస్తుతం వీరిద్దరి ఇన్ స్టా స్టోరీస్ నెట్టింట వైరలవుతున్నాయి.

శ్రీకాకుళం జిల్లా డి.మత్య్సలేశం గ్రామానికి చెందిన పలువురు మత్య్సకారులు వేటకు వెళ్లగా.. పాకిస్తాన్ కోస్ట్ గార్డుకు చిక్కి రెండేళ్లు జైలు శిక్ష అనుభవించిన ఘటన ఆధారంగా తెరకెక్కించారు.





























