- Telugu News Photo Gallery Cinema photos Siddu Jonnalagadda TelusuKada Team joins Aha Telugu Indian Idol Season, See Photos
Telugu Indian Idol: ఆహా తెలుగు ఇండియన్ ఐడల్‌లో ‘తెలుసు కదా’ టీమ్.. పండగ స్పెషల్ ఎపిసోడ్ ఎప్పుడంటే?
ప్రముఖ తెలుగు సింగింగ్ రియాలిటీ షో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఆహాలో ప్రతి శుక్ర, శనివారాల్లో కొత్త ఎపిసోడ్స్ టెలికాస్ట్ అవుతున్నాయి. అలా ఈ వారం తెలుగు ఇండియన్ ఐడల్ లో తెలుసు కదా టీమ్ సందడి చేయనుంది.
Updated on: Sep 24, 2025 | 3:15 PM

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం తెలుసు కదా. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా ఈ మూవీలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా తెలుసు కదా చిత్రం బృందం ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ లో సందడి చేసింది. హీరో సిద్దుతో పాటు హీరోయిన్లు శ్రీనిధి, రాశీ ఖన్నా ఈ సింగింగ్ రియాలిటీ షోకు అతిథులుగా విచ్చేశారు.

ఈ సందరర్భంగా షో హోస్ట్ లు సింగర్స్ శ్రీరామ చంద్ర, సమీరా భరద్వాజ్ తెలుసు కదా టీమ్ కు సాదర స్వాగతం పలికారు. అనంతరం తమ సినిమా విశేషాలను అందరితో పంచుకున్నారు హీరో సిద్దు

ప్రస్తుతం ఈ పండగ స్పెషల్ ఎపిసోడ్ కు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ముఖ్యంగా శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నాలు ట్రెడిషినల్ దుస్తుల్లో ఎంతో అందంగా కనిపించారు

ఈ పండగ స్పెషల్ ఎపిసోడ్ సెప్టెంబర్ 26 (శుక్రవారం), 27 (శనివారం) తేదీల్లో సాయంత్రం ఏడు గంటలకు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

తెలుసు కదా చిత్రంతో ప్రముఖ సెలబ్రిటీ స్టైలిస్ట్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతోంది. మిరాయ్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తోంది. దీపావళి కానుకగా అక్టోబర్ 17, 2025న తెలుసు కదా సినిమా విడుదల కానుంది.




