- Telugu News Photo Gallery Cinema photos Showing faults in the system creates Impact on Tollywood and message oriented movies Telugu Entertainment Photos
System Impact Movies: టాలీవుడ్ సైతం సిస్టమ్‌ను ప్రశ్నించే సినిమాలకు భారీ డిమాండ్.!
రొటీన్ కమర్షియల్ సినిమాలు ఎవరైనా చేస్తారు కానీ సిస్టమ్‌ను ప్రశ్నించే సినిమాలు మాత్రం తక్కువ మంది దర్శకుల నుంచి వస్తుంటాయి. అలాంటి కథలకే డిమాండ్ పెరిగిందిప్పుడు. సమాజంలో జరిగే తప్పులపై మాటల తూటాలు పేల్చే కథలే ఎక్కువగా వస్తున్నాయి. రజినీకాంత్ నుంచి రామ్ చరణ్ వరకు అంతా అదే చేస్తున్నారు. కమర్షియల్ సినిమాలకు ఎవర్ గ్రీన్ క్రేజ్ ఉంటుంది.. కానీ అందులోనే కాస్త సోషల్ మెసేజ్ కూడా దట్టిస్తే కొన్నేళ్ల పాటు గుర్తుండిపోతాయి సినిమాలు.
Updated on: Feb 25, 2024 | 9:18 PM

పాన్ ఇండియా రేంజ్‌లో పొలిటికల్ డ్రామాగా ఈ సినిమాను రూపొదిస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు. అయితే షూటింగ్ ఆలస్యమైనా ఈ సినిమాకు సంబంధించిన ఒక్కో అప్‌డేట్ మెగా ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తోంది.

కమర్షియల్ సినిమాలకు ఎవర్ గ్రీన్ క్రేజ్ ఉంటుంది.. కానీ అందులోనే కాస్త సోషల్ మెసేజ్ కూడా దట్టిస్తే కొన్నేళ్ల పాటు గుర్తుండిపోతాయి సినిమాలు. అందుకే శంకర్ సినిమాలకు అంత డిమాండ్.

కొరటాల కూడా ఈ దారినే నమ్మి శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లాంటి సినిమాలు చేసారు. గతేడాది సార్ అంటూ ధనుష్‌తో ఎడ్యుకేషన్ సిస్టమ్‌పై యుద్ధం చేసారు దర్శకుడు వెంకీ అట్లూరి.

రానా దగ్గుబాటి హీరోగా నటించిన సినిమా లీడర్. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. గ్రిప్పింగ్ పొలిటికల్ డ్రామాగా మెప్పించింది లీడర్. ఏవీయం సంస్థ నిర్మించింది. లీడర్ సినిమాను మే 9న రీరిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. పొలిటికల్ సీజన్‌కి పర్ఫెక్ట్ సినిమా అని అంటున్నారు ఆడియన్స్.

మరీ ముఖ్యంగా ఎడ్యుకేషన్ సిస్టమ్‌లోని తప్పుల్ని చూపించినపుడు ఇంపాక్ట్ ఇంకా బలంగా ఉంటుంది. శంకర్ జెంటిల్‌మెన్ నుంచి నిన్నటి ధనుష్ సార్ వరకు ఈ కాన్సెప్ట్ వర్కవుట్ అవుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో ఎడ్యుకేషన్ సిస్టమ్‌లోని లోపాల గురించి చర్చిస్తూ చాలా సినిమాలే వచ్చాయి.

అందులో 3 ఇడియట్స్, తారే జమీన్ పర్, చిచ్చోరే లాంటి సినిమాలు మంచి విజయం సాధించాయి. ఈ మధ్యే విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన 12Th ఫెయిల్ అద్భుతమైన విజయం సాధించింది. తాజాగా రజినీకాంత్ వెట్టైయాన్ సినిమాలోనూ చదువే ప్రధానంశంగా ఉండబోతుంది.

జై భీమ్ ఫేమ్ జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న వెట్టైయాన్‌లో.. 80వ దశకంలో మన దేశంలోకి వచ్చిన కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లోని లోపాలపై ఒక పోలీస్ ఆఫీసర్ చేసిన పోరాటాన్ని చూపించబోతున్నారు. రానా, ఫహాద్ ఫాజిల్, అమితాబ్ ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి కార్పోరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కథతో సూపర్ స్టార్ ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.




