- Telugu News Photo Gallery Cinema photos Samyuktha Menon has openly discussed her habit of consuming alcohol
Samyuktha: నాకు ఆ అలవాటు ఉంది.. ఒత్తిడిలో ఉన్నప్పుడు మాత్రమే అంటున్న సంయుక్త..
సంయుక్త మీనన్.. తెలుగులో గోల్డెన్ బ్యూటీగా క్రేజ్ సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ వయ్యారి.. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత తెలుగులో సార్, విరూపాక్ష చిత్రాల్లో నటించి మెప్పించింది.
Updated on: Aug 17, 2025 | 9:05 PM

సంయుక్త మీనన్.. తెలుగులో గోల్డెన్ బ్యూటీగా క్రేజ్ సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ వయ్యారి.. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత తెలుగులో సార్, విరూపాక్ష చిత్రాల్లో నటించి మెప్పించింది.

అందం, అభినయంతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న ఈ వయ్యారి.. మొదటి సినిమాతోనే అందరిని కట్టిపడేసింది. తెలుగులో ఆమె నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. కానీ ఈ బ్యూటీకి మాత్రం ఇప్పటికీ అంతగా అవకాశాలు రావడం లేదు. కేవలం చేతిలో ఒక్క సినిమాతోనే నెట్టుకోస్తుంది.

నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న స్వయంభు చిత్రంలో నటిస్తుంది. ఇందులో నభా నటేశ్ సైతం కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా కాకుండా సంయుక్త చేతిలో మరో సినిమా లేదు. అలాగే ఈ బ్యూటీకి మరిన్ని ఆఫర్స్ కూడా రావడం లేదు. దీంతో ఇప్పుడు ఈ అమ్మడు ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యింది.

ప్రస్తుంత సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటున్న సంయుక్త.. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. స్వయంభు సినిమా కోసం సంయుక్త హార్స్ రైడింగ్ నేర్చుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మొన్నామధ్య సంయుక్త మాట్లాడుతూ.. తనకు మద్యంసేవించే అలవాటు ఉందని తెలిపింది.

ఒత్తిడిగా అనిపించినప్పుడలా మద్యం తీసుకుంటాను అని తెలిపింది. రోజూ మద్యం తీసుకోను.. ఒత్తిడి, ఆందోళన అనిపించినప్పుడే కొద్దిగా తీసుకంటా అని తెలిపింది సంయుక్త. ఈ కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ కామెంట్స్ పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.




