- Telugu News Photo Gallery Cinema photos Samantha Ruth Prabhu New sizzling Photos Goes attractive in social media on 22 04 2023 Telugu actors Photos
Samantha: దశాబ్దకాలంగా స్టార్ హీరోయిన్‌గా హవా కొనసాగిస్తున్న సమంత.. ఒక్క ఎదురుదెబ్బతో జ్ఞానోదయం.
అందానికి అందం, నటనకు నటన కనబరుస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు దశాబ్ద కాలంగా స్టార్ హీరోయిన్‌గా హవాను చూపిస్తోంది టాలెంటెడ్ హీరోయిన్ సమంత .ఈ మధ్య కాలంలో సరికొత్త ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ అమ్మడు.. తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలనే చేస్తోంది.
Updated on: Apr 22, 2023 | 5:38 PM

అందానికి అందం, నటనకు నటన కనబరుస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు దశాబ్ద కాలంగా స్టార్ హీరోయిన్‌గా హవాను చూపిస్తోంది టాలెంటెడ్ హీరోయిన్ సమంత .

ఈ మధ్య కాలంలో సరికొత్త ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ అమ్మడు.. తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలనే చేస్తోంది.

ఇందులో భాగంగానే ఇప్పుడు శాకుంతలం అనే చిత్రంతో వచ్చింది. ఏప్రిల్ 14న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి రోజు మొదటి షోతోనే నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది.

శకుంతల- దుష్యంతుల ప్రేమ కథని దర్శకుడు గుణశేఖర్ ఎంగేజింగ్ గా తీర్చిదిద్దలేకపోయాడు.

దీనికి ఆరంభం నుంచే కలెక్షన్లు అంతగా రావడం లేదు. గత చిత్రం యశోదతో పోలిస్తే ఈ సినిమా మరీ డిజాస్టర్ అనే టాక్ కూడా వినిపిస్తోంది.

శాకుంతలం మూవీపై భారీ అంచనాలు ఏర్పడడంతో నైజాంలో నాలుగున్నర కోట్లు, సీడెడ్‌లో కోటి 20 లక్షలు, ఆంధ్రాలో ఆరున్నర కోట్ల బిజినెస్ జరిగింది.

ఇలా తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్ల 20లక్షలకు అమ్ముడైంది. అలాగే, వేరే భాషల్లో 4 కోట్లు, ఓవర్సీస్‌లలో కోటి 80లక్షలతో కలిపి 18కోట్ల బిజినెస్ జరిగింది.

అయితే అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ లేకపోవడంతో చిత్ర యూనిట్ నిరాశగా ఉందట. ఇక, 8 రోజుల్లో దీనికి 5కోట్లు మాత్రమే వచ్చాయి.

అంటే మరో 14కోట్లు వస్తేనే ఇది హిట్ అవుతుంది. కానీ, ఇప్పుడా పరిస్థితి కనిపించడంలేదు.





























