Samantha: మోస్ట్ పాపులర్ లిస్ట్‌లో సమంత టాప్.. అలా ఎలా ??
సమంత కాంపౌండ్ నుంచి సినిమా అప్‌డేట్స్ వచ్చి చాలా కాలం అవుతోంది. శుభం సినిమా రిలీజ్ తరువాత సమంత ఏం చేస్తున్నారన్నది ఎవరికీ తెలీదు. ఓ వెబ్ సిరీస్ షూటింగ్ స్టేజ్‌లో ఉన్నా.. అది ఎప్పుడు రిలీజ్ అవుతుందన్నది తెలీదు. అయినా... పాపులారిటీ విషయంలో మాత్రం నెంబర్ వన్ ప్లేస్‌లో ఉన్నారు సామ్. దీంతో ఈ ట్రెండ్‌కు రీజనేంటో క్రాక్ చేసే పనిలో ఉన్నారు ఫ్యాన్స్.
Updated on: Jul 19, 2025 | 10:22 PM

శుభం సినిమా టైమ్‌లో మీడియా ముందుకు వచ్చిన సమంత, తరువాత మళ్లీ సైలెంట్ అయ్యారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉన్నా.. సినిమా అప్‌డేట్స్ మాత్రం లేవు.

అయినా సరే రీసెంట్ సర్వేలో మోస్ట్ పాపులర్ లిస్ట్‌లో నెంబర్ వన్ ప్లేస్‌లో ఉన్నారు ఈ బ్యూటీ. బాలీవుడ్ హ్యాపెనింగ్ బ్యూటీస్ అలియా భట్, దీపికా పదుకోన్‌ను కూడా వెనక్కి నెట్టి నెంబర్ వన్ ప్లేస్‌లో ఉన్నారు సమంత.

ఈ లిస్ట్‌లో ప్రజెంట్ సిల్వర్ స్క్రీన్ మీద సూపర్ ఫామ్‌లో ఉన్న రష్మిక మందన్న, నయనతార లాంటి బ్యూటీస్ కూడా ఉన్నా.. అందరికంటే టాప్‌లో మాత్రం సమంత పేరే కనిపిస్తోంది.

అయితే సమంతకు ఈ రేంజ్ పాపులారిటీ రావడానికి రీజన్ ఆమె పర్సనల్ లైఫే. కొద్ది రోజులుగా ఎక్కడికెళ్లినా దర్శకుడు రాజ్ నిడుమూరుతో కలిసి కనిపిస్తున్నారు సామ్.

దీంతో వీళ్లిద్దరూ రిలేషన్‌లో ఉన్నారన్న వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తల మూలంగానే న్యూస్ హెడ్‌లైన్స్‌లో కనిపిస్తున్నారు సమంత. అందుకే మోస్ట్ పాపులర్ లిస్ట్‌లో టాప్‌లో ఉన్నారు సామ్.




