- Telugu News Photo Gallery Cinema photos Here's why sai pallavi chosen to play Goddess Sita in Ramayana
Sai Pallavi: సీతగా సాయి పల్లవి సెలక్షన్ లో ఇంట్రస్టింగ్ ట్విస్ట్
హాలీవుడ్ మేకర్స్ కూడా అవాక్కయ్యే రేంజ్‌లో తెరకెక్కుతున్న ఇండియన్ మూవీ రామాయణ. దాదాపు 4000 కోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సౌత్ హీరోయిన్ సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తున్నారు. అయితే బాలీవుడ్‌లో ఎంతో మంది తారలు ఉన్నా... ఏరి కోరి సాయి పల్లవినే సీత పాత్ర వరించటం వెనుక కారణమేంటి..?
Updated on: Jul 19, 2025 | 10:17 PM

రణబీర్ కపూర్ రాముడిగా, యష్ రావణాసురుడిగా నటిస్తున్న ప్రస్టీజియస్ మూవీ రామాయణ. నితేష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగం 2026 దీపావళి కానుకగా రిలీజ్ కానుంది.

ఇంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీత పాత్ర దక్షిణాది నటి సాయి పల్లవిని వరించింది. అయితే సాయి పల్లవి సెలక్షన్ వెనుక చాలా కారణాలే ఉన్నాయి.

ముఖ్యంగా సౌత్‌లో ఆమెకున్న ఇమేజ్, కమర్షియల్ సినిమాల్లో నటించినా ఎక్కువగా గ్లామర్ షో చేయకపోవటం వల్లే సీత పాత్రకు ఆమెను తీసుకున్నారన్న అంచాలు ఉన్నాయి.

సాయి పల్లవి సెలక్షన్ విషయంలో మేకర్స్ కూడా క్లారిటీ ఇచ్చారు. 'ఆమె ఎలాంటి కాస్మొటిక్ సర్జరీల జోలికీ వెళ్లలేదు. ఆర్టిఫీషియల్ మేకప్స్ కన్నా... ఒరిజినల్ లుక్‌లో కనిపించేందుకు ఎక్కువ ఇంట్రస్ట్ ఇష్టపడతారు.

అందుకే సీత పాత్రకు ఆమె పర్ఫెక్ట్ ఛాయిస్ అని ఫిక్స్ అయ్యాం' అన్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి సాయి పల్లవి ఫాలో అయిన రూల్సే ఆమెకు ఇంత భారీ ప్రాజెక్ట్‌లో అవకాశం తెచ్చిపెట్టింది అంటున్నారు ఫ్యాన్స్.




