- Telugu News Photo Gallery Cinema photos Tollywood Actress Anupama Parameswaran Visits Hyderabad Balkampet Yellamma Temple, See Photos
Anupama Parameswaran: బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో అనుపమ పరమేశ్వరన్ ప్రత్యేక పూజలు.. ఫొటోస్ ఇదిగో
మొన్నటివరకు ఎక్కువగా గ్లామరస్ రోల్స్ లో కనిపించిన మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలకూ సై అంటోంది. ఆమె నటించిన తాజా చిత్రం. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో రిలీజ్ కానుంది
Updated on: Jul 19, 2025 | 10:32 PM

ప్రస్తుతం తెలంగాణలో బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. ప్రముఖ ఆలయాళ్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

తాజాగా టాలీవుడ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్నిదర్శించుకుంది. తన లేటెస్ట్ సినిమా పరదా చిత్ర బృందంతో కలిసి అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించింది.

ఈ సందర్భంగా ఆలయాధికారులు అనుపమకు ఘన స్వాగతం పలికి ఆశీర్వాదాలు అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా అవుతున్నాయి.

అనుపమ ప్రధాన పాత్రలో నటించిన పరదా సినిమా ఆగస్టు 22న థియేటర్లలో విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగానే ఇటీవల సెకెండ్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ క్రమంలోనే అనుపమ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో పూజలు నిర్వహించింది. 'సినిమా బండి' తో ఆకట్టుకున్న ప్రవీణ్ కాండ్రేగుల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

పరదా సినిమాలో అనుపమ పరమేశ్వరన్ తో పాటు నటి సంగీత, దర్శన రాజేంద్రన్, రాగ్ మయూర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికీ రిలీజైన టీజర్,సాంగ్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచాయి.




