- Telugu News Photo Gallery Cinema photos Samantha has been replaced by Sreeleela in the movie The Chennai Story according to reports telugu cinema news
Sreeleela: సమంత ప్లేస్ కొట్టేసిన యంగ్ హీరోయిన్ ?.. ఆ ఇంగ్లీష్ సినిమాలో శ్రీలీల..
పెళ్లి సందD సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్రీలీల. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇంకేముంది తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. మాస్ మాహారాజా రవితేజ సరసన ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ బ్యూటీ చేతిలో ఇప్పుడు ఏకంగా పది సినిమాల వరకు ఉన్నాయి.
Updated on: May 31, 2023 | 7:38 PM

పెళ్లి సందD సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్రీలీల. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

ఇంకేముంది తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. మాస్ మాహారాజా రవితేజ సరసన ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ బ్యూటీ చేతిలో ఇప్పుడు ఏకంగా పది సినిమాల వరకు ఉన్నాయి.

బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న సినిమాలో నటిస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ జతగా ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తుంది. అలాగే విజయ్ దేవరకొండ కొత్త చిత్రంలోనూ నటిస్తుంది.

ఇవే కాకుండా తమిళం, మలయాళంలో పలు సినిమీలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక తాజాగా ఈ బ్యూటీ మరో బంపర్ ఆఫర్ అందుకున్నట్లుగా తెలుస్తోంది.

లేటేస్ట్ సమాచారం ప్రకారం శ్రీలీల ఇప్పుడు హాలీవుడ్ ప్రాజెక్ట్ ఛాన్స్ అందుకుందట. ది చెన్నై స్టోరీ అనే ఒక ఇంగ్లిష్ సినిమాను వివేక్ కల్రా హీరోగా రూపొందిస్తున్నారు.

ఫిలిప్ జాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ముందుగా సమంత పేరు వినిపించింది. ఆమెను కథానాయికగా తీసుకున్నారనే ప్రచారం జరిగింది. ఆమెకి బదులుగా ఇప్పుడు శ్రీలీల పేరు వినిపిస్తోంది.

ఇంగ్లాండ్ యువకుడికి .. చెన్నై కి చెందిన యువతికి మధ్య నడిచే ప్రేమ .. ఈ కథలో ప్రధానంగా కనిపిస్తుందని అంటున్నారు. మొత్తానికి శ్రీలీల ఖాతాలో మరో పెద్ద ప్రాజెక్టు చేరిపోయింది.

సమంత ప్లేస్ కొట్టేసిన యంగ్ హీరోయిన్ ?.. ఆ ఇంగ్లీష్ సినిమాలో శ్రీలీల..

సమంత ప్లేస్ కొట్టేసిన యంగ్ హీరోయిన్ ?.. ఆ ఇంగ్లీష్ సినిమాలో శ్రీలీల..





























