- Telugu News Photo Gallery Cinema photos Sai pallavi and keerthy suresh comments on her movie offers Telugu Actors Photos
sai pallavi – keerthy suresh: మేమింతే.! మారలేం.! అలా చెయ్యలేం..! అంటున్న కీర్తి సురేష్, సాయి పల్లవి..
ఇద్దరూ స్టార్ హీరోయిన్లే.. ఇద్దరికీ అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది.. పైగా గ్లామర్ షోకు దూరంగా ఉంటారు.. కానీ ఈ మధ్య సరైన విజయం లేక కాస్త వెనకబడ్డారు. క్రేజ్ బోలెడున్నా.. ఆఫర్స్ విషయంలో ఆచుతూచి అడుగేస్తున్న ఆ ముద్దుగుమ్మలెవరు..?
Updated on: Aug 04, 2022 | 5:01 PM

ఇద్దరూ స్టార్ హీరోయిన్లే.. ఇద్దరికీ అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది.. పైగా గ్లామర్ షోకు దూరంగా ఉంటారు.. నటనతోనే కావాల్సినంత గుర్తింపు తెచ్చుకున్నారు..

అందులో ఒకరు నేషనల్ అవార్డు సైతం అందుకున్నారు. కానీ ఈ మధ్య సరైన విజయం లేక కాస్త వెనకబడ్డారు. క్రేజ్ బోలెడున్నా.. ఆఫర్స్ విషయంలో ఆచుతూచి అడుగేస్తున్నారు.

అవకాశం రావడం కాదు.. వచ్చింది నచ్చాలంటున్నారు.. ఖాళీగా అయినా ఉంటాం కానీ నచ్చని కథలో నటించేదే లేదంటున్న ఆ ముద్దుగుమ్మలెవరు..?

టాలీవుడ్‌లో కీర్తి సురేష్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. మహానటితో ఏకంగా జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు.

అటు లేడీ ఓరియెంటెడ్ కథలతో పాటు.. ఇటు కమర్షియల్ సినిమాల్లోనూ నటిస్తూ స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకున్నారు కీర్తి.

మరోవైపు సాయి పల్లవిది మాత్రం మరో భిన్నమైన కథ. ఈమె స్టార్ హీరోల సినిమాల్లో నటించలేదు కానీ ఈమె నటించిన సినిమాలకే స్టార్ హీరోల స్థాయిలో క్రేజ్ ఉంటుంది.

ఫిదా నుంచి సాయి పల్లవి నటించిన ప్రతీ సినిమాకు ఫ్యాన్స్ ఉన్నారు. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేని క్రేజ్ ఈమె సొంతం. అందుకే గ్లామర్ ఇండస్ట్రీలో అందాలు ఆరబోయకుండానే.. స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నారు సాయి పల్లవి.

కానీ ఈ మధ్య లవ్ స్టోరీ మినహా ఈమెకి మరో హిట్ లేదు. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం తెలుగులో సాయి పల్లవికి ఒక్క ఆఫర్ కూడా లేదు. నచ్చిన కథ రాకపోతే.. ఖాళీగానే ఉంటాను తప్ప ఏ సినిమా పడితే ఆ సినిమా చేయనని ఖరాఖండిగా చెప్తున్నారు ఈ భామ.

మరోవైపు కీర్తి సురేష్ ఇదే దారిలో వెళ్తున్నారు. సర్కారు వారి పాట తర్వాత స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు కీర్తి. వరసగా సినిమాలు చేయాలని తనకేం లేదని.. 10 పిచ్చి కథలు చేసేకంటే ఓ మంచి సినిమా చేయాలని ఉందని చెప్పుకొచ్చారు ఈ భామ.

ప్రస్తుతం తెలుగులో భోళా శంకర్‌లో చిరు చెల్లిగా నటిస్తున్నారు కీర్తి సురేష్. మొత్తానికి బోలెడు అవకాశాలు వస్తున్నా.. నచ్చే కథ వచ్చేవరకు అలాగే వేచి చూస్తున్నారు కీర్తి సురేష్, సాయి పల్లవి.




