- Telugu News Photo Gallery Cinema photos Rashmika Mandanna's Career Upcoming Projects and Hit Collaborations
Rashmika Mandanna: అన్ని జానర్లు నావే.. దేన్నీ వదలను అంటున్న నేషనల్ క్రష్
కొత్త సిలబస్ చదవడానికి కష్టపడాలి గానీ, ఆల్రెడీ చదివిన నావెల్‌ని చదడానికి ఇబ్బంది పడాల్సిన పనేముంది..? అలా అలా పేజీలు తిరగేసేయొచ్చు కదా.. నియర్ ఫ్యూచర్‌లో ఇలాంటి ఫేజ్‌నే ఆస్వాదించబోతున్నారు మిస్ రష్మిక మందన్న. ఇంతకీ ఏంటా ఫేజ్? ఆమెకు అంతగా అలవాటైన విషయమేంటి? అంటారా... చూసేద్దాం పదండి...
Updated on: Sep 11, 2025 | 7:32 PM

రష్మిక హవా మామూలుగా లేదు. సైలెంట్‌గా వచ్చి సక్సెస్ అయ్యారు ఈ లేడీ. ఇప్పుడు ఆ సక్సెస్‌ని నిలబెట్టుకునే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. నార్త్, సౌత్ తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు మిస్ నేషనల్ క్రష్.

కొత్త ప్రాజెక్టులతో, సరికొత్త కాంబినేషన్లతో దూసుకుపోవడం ఓ వైపు. ఆల్రెడీ పరిచయం ఉన్న.. హిట్ కాంబినేషన్లతో కంటిన్యూ కావడం మరో వైపు.. స్ట్రెస్‌ని రష్మిక హ్యాండిల్ చేస్తున్న సీక్రెట్ ఇదేనని చెప్పుకుంటున్నవాళ్లు కోకొల్లలు.

విజయ్ దేవరకొండ - రష్మిక కాంబో స్క్రీన్ మీద కనిపిస్తే చూడాలనుకునే మూవీ లవర్స్ చాలా మందే ఉన్నారు. అలాంటివారిని ఎప్పటి నుంచో ఊరిస్తోందీ కాంబో. మీరు అలాగే గట్టిగా అనుకుంటూ ఉండండి.. త్వరలోనే కల సాకారమవుతుందని అంటున్నారు మేకర్స్.

విజయ్ దేవరకొండతోనే కాదు... టాలీవుడ్‌లో అల్లు అర్జున్‌తోనూ సూపర్ సక్సెస్ చూశారు సిల్వర్ స్క్రీన్ శ్రీవల్లి. బ్యాక్ టు బ్యాక్ పుష్ప మూవీస్‌తో మెప్పించింది వీరి కాంబో. నెక్స్ట్ పుష్ప3 కూడా ఉందని సుకుమార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేయడంతో... ఎంత త్వరగా ఈ కాంబోని స్క్రీన్స్ మీద చూస్తామా అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.

సందీప్ వంగా హీరోయిన్లకు ఎప్పుడూ స్పెషల్ ప్లేస్ ఉంటుంది ఇండస్ట్రీలో. అలాంటి ప్లేస్‌నే కొట్టేశారు రష్మిక మందన్న. యానిమల్‌లో ఆమె నటనకు ఫుల్ మార్కులు పడ్డాయి. స్పిరిట్ కంప్లీట్ కాగానే సందీప్ టేకప్ చేసే యానిమల్ సీక్వెల్‌లో రష్మికను మరోసారి చూడ్డానికి మేం సిద్ధమే అనే సిగ్నల్స్ పంపిస్తున్నారు అభిమానులు.




