- Telugu News Photo Gallery Cinema photos Actress Kalyani Priyadarshan Says Her Favourite Hero In Kollywood Industry
Kalyani Priyadarshini: అతడే నా ఫేవరేట్ హీరో.. ఆయనకు నేను పెద్ద అభిమానిని.. హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్
కళ్యాణి ప్రియ దర్శన్ మలయాళ సినిమాలో ప్రముఖ నటి. ఆమె ఇటీవల విడుదలైన 'లోక చాప్టర్ 1 చంద్ర' సినిమా థియేటర్లలో బాగానే వసూళ్లు సాధిస్తోంది. ఈ పరిస్థితిలో, తన అభిమాన నటుడి గురించి ఆమె గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది. అందులో ఆమె తన ఫేవరేట్ హీరో గురించి వెల్లడించింది.
Updated on: Sep 11, 2025 | 7:30 PM

కళ్యాణి ప్రియదర్శన్ సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. 2017 నుండి సినిమాల్లో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. 2019లో తమిళ సినిమాలో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. నటుడు శివకార్తికేయన్ సరసన నటించి మెప్పించింది.

2020 లో మలయాళ సినిమాలో నటిగా అడుగుపెట్టిన నటి కళ్యాణి ప్రియదర్శన్ అనేక చిత్రాల్లో నటించింది. ఇప్పుడు ఆమె నటించిన లోకా చాప్టర్ 1 చిత్రం దూసుకుపోతుంది. ఇప్పటివరకు దాదాపు 200 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది.

కళ్యాణి ప్రియదర్శన్ కొన్ని సంవత్సరాల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, శివకార్తికేయన్ తనతో నటించక ముందే తాను ఆయనకు పెద్ద అభిమానినని అన్నారు. ఈ విషయం చెప్పినప్పుడు అతను నమ్మలేకపోయాడని తెలిపింది.

అతను సెట్‌లో ఉన్నప్పుడు మేము నవ్వుకునేవాళ్ళం. అతడి కామెడీ టైమింగ్ అంటే నాకు ఎంతో ఇష్టం అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కల్యాణి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

కల్యాణి ప్రియదర్శన్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. అలాగే ఇప్పుడు లోకా సినిమా మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.




