- Telugu News Photo Gallery Cinema photos Rashmika Mandanna says she will happily announced her retirement
Rashmika Mandanna: ఆనందంగా రిటైర్మెంట్ ప్రకటించేస్తా.. రష్మిక ఇలా ఎందుకు అన్నట్టు.?
కెరీర్ సూపర్ ఫామ్‌లో ఉన్న టైమ్‌లో ఏ హీరోయిన్ అయినా రిటైర్మెంట్ గురించి ఆలోచించే ప్రయత్నం కూడా చేయరు. కానీ నెంబర్ వన్ రేసులో ఉన్న రష్మిక మాత్రం సంథింగ్ స్పెషల్. అందుకే కెరీర్ పీక్స్‌లో ఉన్న టైమ్‌లో తన రిటైర్మెంట్ గురించి మాట్లాడారు నేషనల్ క్రష్.
Updated on: May 23, 2025 | 5:24 PM

ప్రజెంట్ సౌత్ నార్త్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న వన్ అండ్ ఓన్లీ బ్యూటీ రష్మిక మందన్న. ఓ వైపు కమర్షియల్ సినిమాలు, మరో వైపు ప్రయోగాలు కూడా చేస్తున్న ఈ భామ, కమర్షియల్ సక్సెస్‌ల విషయంలోనూ అందరికంటే ముందే ఉన్నారు.

గత ఏడాది పుష్ప 2 ది రూల్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. హిందీలో కూడా సినిమాలు చేస్తున్నారు. కెరీర్ ఇంత హైలో ఉన్న టైమ్‌లో రిటైర్మెంట్ గురించి ఓ ఈవెంట్లో ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు రష్మిక మందన్న.

గతంలో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిస్టారికల్ మూవీ ఛావా ట్రైలర్ లాంచ్‌లో పాల్గొన్న రష్మిక ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో ఛత్రపతి శంభాజీ మహారాజ్ భార్యగా నటించిన రష్మిక... ఈ అవకాశం తనకు రావటం అదృష్టంగా భావిస్తున్నా అన్నారు.

వరుసగా గ్లామర్ రోల్స్‌లో అదరగొట్టిన రష్మిక ఈ సినిమాలో చీరకట్టులో హుందాగా కనిపించరు. ఇంత మంచి క్యారెక్టర్ చేసిన తరువాత తాను ఆనందంగా రిటైర్మెంట్ ప్రకటించేస్తా అంటూ షాకింగ్ కామెంట్ చేశారు రష్మిక.

శ్రీవల్లి సీరియస్‌గా అనకపోయినా... ఆమె నోటి నుంచి రిటైర్మెంట్ అన్న మాట రావటంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు ఫ్యాన్స్. సరదాగా కూడా అలాంటి కామెంట్స్ చేయోద్దంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.




