- Telugu News Photo Gallery Cinema photos Rashmika Mandanna Heartwarming Birthday Post For Her Sister Shiman Photos Goes Viral telugu movie news
Rashmika Mandanna: రష్మిక మందన్న చెల్లెలు ఎంత క్యూట్‌గా ఉందో చూశారా..? ఎంత చిన్న అమ్మాయి అంటే..
ప్రస్తుతం పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్ జాబితాలో రష్మిక మందన్న ఒకరు. నేషనల్ క్రష్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ వయ్యారి. ఇప్పుడు చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉంటుంది. తాజాగా తన చెల్లెలి ఫోటోను షేర్ చేసింది. రష్మికకు 9 ఏళ్ల వయసున్న ఒక చెల్లెలు ఉంది. ఆ చిన్నారి పేరు షిమాన్ మందన్న.
Updated on: May 03, 2024 | 12:02 PM

ప్రస్తుతం పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్ జాబితాలో రష్మిక మందన్న ఒకరు. నేషనల్ క్రష్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ వయ్యారి. ఇప్పుడు చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉంటుంది. తాజాగా తన చెల్లెలి ఫోటోను షేర్ చేసింది రష్మిక.

రష్మికకు 9 ఏళ్ల వయసున్న ఒక చెల్లెలు ఉంది. ఆ చిన్నారి పేరు షిమాన్ మందన్న. మే 2న తన చిన్నారి చెల్లి బర్త్ డే సందర్భంగా తన ఇన్ స్టా స్టోరీలో ఫోటో షేర్ చేస్తూ చెల్లికి విషెస్ తెలిపింది రష్మిక. అలాగే తన బర్త్ డే సెలబ్రెషన్స్ మిస్ అవుతున్నానంటూ రాసుకోచ్చింది.

రష్మికకు ఆమె చెల్లికి దాదాపు పది సంవత్సరాల గ్యాప్ ఉంది. ప్రస్తుతం రష్మిక వయసు 28 సంవత్సరాలు. ఇక తన చిన్నారి చెల్లి వయసు 9 ఏళ్లు. తన చిన్నారి చెల్లెలు ఎదుగుదలను తాను మిస్ అవుతున్నానని.. అలాగే తనతో సరదాగా గడిపే సమయాన్ని మిస్ అవుతున్నానని గతంలో తెలిపింది.,

అలాగే తన చెల్లి ఈ ప్రపంచంలోకి వచ్చినప్పటి నుంచి చాలాకాలం పాటు దగ్గరుండి చూసుకున్నానని.. స్నానం చేయించడం నుంచి డైపర్స్ మార్చడం వరకు అన్ని పనులు చేసేదాన్ని అని అంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో తన చెల్లి గురించి చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం రష్మిక వరుస సినిమాలతో బిజీగా ఉండడం కారణంగా తన చెల్లి ఎదుగుదలను చూడలేకపోతున్నానని.. తనతో ఎక్కువగా సమయం గడపలేకపోతున్నానని తెలిపింది. ఇప్పుడు రష్మికఅ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2లో నటిస్తుంది.

అలాగే గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో చిత్రాల్లో నటిస్తుంది. ఈ రెండు సినిమాలు లేడీ ఓరియెంటెడ్ డ్రామాలుగా వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు రష్మిక తన చెల్లితో కలిసున్న ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.





























