Rashmika: ఆరు భాషల్లో మాట్లాడతా.. హైదరాబాద్‌లో నా స్లాంగ్ ఇలాగే ఉంటది: రష్మిక
అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్‌గా పాపులారిటీ సొంతం చేసుకుంది రష్మిక మందన్నా. ప్రస్తుతం ఆమె దక్షిణాది భాషలతో హిందీలోనూ వరుసగా సినిమాలు చేస్తోంది.
Updated on: Jul 11, 2023 | 12:37 PM

అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్‌గా పాపులారిటీ సొంతం చేసుకుంది రష్మిక మందన్నా. ప్రస్తుతం ఆమె దక్షిణాది భాషలతో హిందీలోనూ వరుసగా సినిమాలు చేస్తోంది.

ఈక్రమంలో తన సినిమా షూటింగుల కోసం తరచూ ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాలను చుట్టేస్తోంది రష్మిక. దీంతో నేషనల్ క్రష్‌గా క్రేజ్ తెచ్చుకుంది రష్మిక.

సోషల్ మీడియాలోనూ శ్రీవల్లికి భారీగా ఫాలోయింగ్ ఉంది. నెటిజన్లతోనూ తరచూ ముచ్చటిస్తుంటుంది. తాజాగా తన ఫాలోవర్లతో ఛాట్ చేసిన ఆమె వారు అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలిచ్చింది.

ఈ సందర్భంగా తాను ఆరు భాషల్లో మాట్లాడతానని ఫ్యాన్స్ తో చెప్పుకొచ్చింది రష్మిక. హైదరాబాద్‌లో వాళ్లతో మాట్లాడేటప్పుడు మాత్రం ‘నమస్తే.. బాగున్నారా’ అని పలకరిస్తానంటూ తెలిపింది.

ఇక తనకు ఇష్టమైన ప్రదేశం కూర్గ్ అని, కొరియన్ ఫ్రైడ్ చికెన్‌ను ఇష్టంగా తింటానంది రష్మిక. ప్రస్తుతం పుష్ప2తో పాటు యానిమల్, రెయిన్‌బో సినిమాల్లోనూ నటిస్తోంది శ్రీవల్లి.





























