- Telugu News Photo Gallery Cinema photos Ram Charan Jr NTR starrer and SS Rajamouli's Film RRR's Natu Natu Song Wins Best Song Award
RRR Movie: తెలుగు సినిమా ఖ్యాతి శిఖరాగ్రస్థాయికి చేర్చిన ఆర్ఆర్ఆర్.. ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు..
2022 మార్చి 24న విడుదలైన ఆర్ఆర్ఆర్ మూవీ తెలుగు సినిమా గొప్పతనాన్ని మరో సారి చాటిచెప్పింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించారు. ఇక వీరు వేసిన ‘నాటు నాటు’ స్టెప్పులకు ప్రపంచవ్యాప్తంగా దుమ్ములేసిపోయింది. అంతేకాక ఈ పాట మంగళవారం(జనవరి 10) 80వ గోల్డెన్ గ్లోబ్స్‌లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అవార్డును గెలుచుకుంది..
Updated on: Jan 11, 2023 | 2:14 PM

2022 మార్చి 24న విడుదలైన ఆర్ఆర్ఆర్ మూవీ తెలుగు సినిమా గొప్పతనాన్ని మరో సారి చాటిచెప్పింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించారు. ఇక వీరు వేసిన ‘నాటు నాటు’ స్టెప్పులకు ప్రపంచవ్యాప్తంగా దుమ్ములేసిపోయింది. అంతేకాక ఈ పాట మంగళవారం(జనవరి 10) 80వ గోల్డెన్ గ్లోబ్స్‌లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అవార్డును గెలుచుకుంది.

ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి స్వరపరిచిన ఈ పాటను కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. బుధవారం ఈ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు గెలుచుకోవడంతో.. కీరవాణి అవార్డుతో ప్రెస్ రూమ్‌లో పోజులిచ్చారు.

కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్‌లోని బెవర్లీ హిల్టన్ హోటల్‌లో జరిగిన 80వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల వేడుకలో మన నాటు నాటు పాట అనేక పాటలతో పోటిపడింది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కోసం నాటు నాటు పాట ‘వేర్ ది క్రాడాడ్స్ సింగ్’ నుంచి ‘కరోలినా’,‘పినోచియో’ సినిమా నుంచి ‘సియావో పాపా’, ‘టాప్ గన్: మావెరిక్’ నుంచి ‘హోల్డ్ మై హ్యాండ్’ ఇంకా ‘బ్లాక్ పాంథర్: వాకండ ఫరెవర్’ నుంచి ‘లిఫ్ట్ మీ అప్’ పాటలతో పోటీ పడింది.

80వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు వేడుకలకోసం కాలిఫోర్నియాకు వెళ్లిన ‘RRR’ టీమ్ సభ్యులు(రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, SS రాజమౌళి) అవార్డు ప్రదానోత్సవానికి ముందుగా ఫోటోలకు ఫోజులిచ్చారు.

గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు ప్రదానోత్సవంలో ఉపాసన కోణిదెల, రామ్ చరణ్ తేజ్, ఎస్ ఎస్ రాజమౌళి, ఎమ్ఎమ్ కీరవాణి, జూ.ఎన్టీఆర్, లక్ష్మీ ప్రశాంతి.

సరదాగా ఫోటోలకు ఫోజులిచ్చిన ఎన్టీఆర్, లక్ష్మి ప్రశాంతి; మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.

ఆర్ఆర్ఆర్ సినిమా గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు ప్రదానోత్సవం సందర్భంగా తమ తమ జీవిత భాగస్వామితో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చిన మూవీ టీమ్.




