టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే అది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అని ఠక్కున చెప్పొచ్చు. ఆయన పెళ్లి కోసం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. పాన్ ఇండియా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ డార్లింగ్ మాత్రం ఆ ఊసే ఎత్తకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇప్పుడు డార్లింగ్ చేస్తున్న సినిమాలన్ని భారీ బడ్జెట్ చిత్రాలు కావడం విశేషం. అప్పట్లో బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడు అనుకున్నారు అంతా.