- Telugu News Photo Gallery Cinema photos Poonam Kaur diagnosed with Fibromyalgia fans pray for her speedy recovery
Poonam Kaur: అయ్యో పాపం.. పూనమ్ కౌర్‌కు అరుదైన వ్యాధి.. త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ప్రార్థనలు
మన హీరోయిన్ల టైమ్ అస్సలు బాగోలేనట్లుంది. ఇప్పటికే మయోసైటిస్‌తో బాధ పడుతున్నారు సమంత. ఈ విషయం ఇంకా పచ్చిగా ఉండగానే.. మరో హీరోయిన్ కూడా అరుదైన వ్యాధితో బాధపడుతోంది.
Updated on: Dec 02, 2022 | 1:28 PM

మన హీరోయిన్ల టైమ్ అస్సలు బాగోలేనట్లుంది. ఇప్పటికే మయోసైటిస్‌తో బాధ పడుతున్నారు సమంత. ఈ విషయం ఇంకా పచ్చిగా ఉండగానే.. మరో హీరోయిన్ కూడా అరుదైన వ్యాధితో బాధపడుతోంది. సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలోనే యాక్టివ్‌గా ఉండే ఆ బ్యూటీ ఎవరో కాదు పూనమ్ కౌర్. ప్రస్తుతం చికిత్స కోసం కేరళ వెళ్లారు.

గ్లామర్ ఫీల్డ్‌లో పైకి చూడ్డానికి అంతా అందంగానే ఉంటుంది కానీ లోపల మాత్రం చెప్పుకోలేని బాధలు ఉంటాయి. స్క్రీన్ మీద తమ అందాలతో మాయ చేసే ముద్దుగుమ్మలు.. తెరవెనక భయంకరమైన వ్యాధులతో బాధ పడుతున్నారు. ఇప్పటికే సమంత మయోసైటిస్ ట్రెండింగ్‌లో ఉంది.

ఈ వ్యాధి కారణంగా కొన్ని నెలలుగా సినిమాలకు దూరమైపోయారు స్యామ్. తాజాగా పూనమ్ కౌర్ సైతం ఓ డిసీజ్ బారిన పడ్డారు. ఫైబ్రో మైయాల్జియా అనే అరుదైన వ్యాధితో బాధ పడుతున్నారు పూనమ్ కౌర్. ప్రస్తుతం కేరళలో ఆయుర్వేద వైద్యం తీసుకుంటున్నారీమె.

అలసట, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మానసిక స్థితిలో సమస్యలు, కండరాల నొప్పి లాంటివి ఈ వ్యాధి లక్షణాలు. సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలోనే పాపులర్ అయ్యారు పూనమ్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సంబంధిత వార్తలతో ఈమె అప్పట్లో బాగా వైరల్ అయ్యారు.

శ్రీకాంత్, ఎస్వీ కృష్ణారెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన మాయాజాలంతో హీరోయిన్‌గా పరిచయమైన పూనమ్.. పెద్ద సినిమాల్లో పెద్దగా కనబడలేదు. నాగవల్లి, శౌర్యం లాంటి ఒకట్రెండు సినిమాలు చేసినా.. సహాయ పాత్రలకే పరిమితయ్యారు. ప్రస్తుతం కేరళలో టాకింగ్ థెరపీతో పాటు కొన్ని ఎక్సర్‌సైజులు చేశారు పూనమ్. ప్రస్తుతం మహారాష్ట్రలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

త్వరలోనే ఈ డిసీజ్ నుంచి బయటపడతానని ధీమాగా చెప్తున్నారు పూనమ్ కౌర్. అదే జరగాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులూ కోరుకుంటున్నారు. ఆమె ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నట్లు ట్విట్టర్‌లో కామెంట్స్ చేస్తున్నారు.




