- Telugu News Photo Gallery Cinema photos Is this the reason why Pawan Kalyan did not come to Alis daughters wedding
అలీ కూతురు పెళ్లికి పవన్ కల్యాణ్ అందుకే రాలేదు.. ఇండస్ట్రీ వర్గాల్లో టాక్
కమెడియన్ అలీ కూతురు పెళ్లికి పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు..? టాలీవుడ్ అతిరథ మహారథులంతా హాజరైన ఈ వేడుకలో పవర్ స్టార్ మాత్రమే ఎందుకు కనిపించలేదు..?
Updated on: Dec 02, 2022 | 1:08 PM

కమెడియన్ అలీ కూతురు పెళ్లికి పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు..? టాలీవుడ్ అతిరథ మహారథులంతా హాజరైన ఈ వేడుకలో పవర్ స్టార్ మాత్రమే ఎందుకు కనిపించలేదు..? ఆప్తమిత్రుడి కూతురు పెళ్లి కంటే పవన్‌కు ఉన్న బిజీ వర్క్ ఏంటి..? రాజకీయాలే ఇద్దరు మిత్రుల మధ్య దూరం పెంచాయా లేదంటే అనుకోకుండా పవన్ ఈ పెళ్లిని మిస్సయ్యారా..? అసలేం జరిగింది..?

టాలీవుడ్‌లో బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా పవన్ కళ్యాణ్, అలీ ఉంటారు. అలీ లేకుండా సినిమా చేస్తే.. తనకు ఏదో వెలితిగా ఉంటుందని.. అందుకే చిన్న పాత్రలోనైనా అలీని పెట్టుకోమని దర్శకులకు చెప్తానంటూ పవన్ చెప్పారంటే.. ఈ ఇద్దరి స్నేహం ఎలాంటిదో అర్థమవుతుంది.

అలాంటి స్నేహితుడి కూతురు పెళ్లికి పవన్ రాకపోవడంతో.. ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందనే వార్తలు మొదలయ్యాయి. ఒకప్పట్లా పవన్ కళ్యాణ్, అలీ కలిసి నటించడం లేదు. కాటమరాయుడు తర్వాత అలీకి పవన్ సినిమాల్లో ఛాన్సులు రావట్లేదు. అజ్ఞాతవాసి, వకీల్ సాబ్, భీమ్లా నాయక్‌లలో అలీ కనిపించలేదు.

పైగా జనసేనను కాదని.. వైసిపిలో జాయిన్ కావడం.. అప్పట్లో ఈ ఇద్దరూ ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకోవడంతో ఇద్దరి మధ్య దూరం బాగా పెరిగిపోయిందనే వాదన ఉంది. రాజకీయ విభేధాల కారణంగా అలీ కూతురు పెళ్లికి పవన్ రాకుండా ఉంటారా..? మరీ అతడి స్నేహాన్ని అంత తక్కువ చేస్తారా..? ఛాన్సే లేదు.. పవన్ రాకపోవడానికి మరో కారణం ఉందని అలీనే తెలిపారు.

అలీ కూతురు పెళ్లి రోజు.. పవన్ విజయవాడలో ఉన్నారు. ఇప్పటం బాధితులకు చెక్కుల పంపిణీ చేస్తున్నారు. అక్కడ్నుంచి ఫ్లైట్ ఆలస్యం కావడంతోనే పెళ్లికి రాలేదని తెలుస్తుంది. ఎన్ని విభేధాలున్నా.. అలీ అంటే పవన్‌కు చాలా ఇష్టం.. అందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు.

అయినా ఎవరెవరి పెళ్లిళ్లకో వెళ్లి.. అక్కడ కలిసి నవ్వుతూ మాట్లాడుకున్నారు అలీ, పవన్ కళ్యాణ్. అలాంటిది అలీ సొంత కూతురు పెళ్లికి పవన్ రాకుండా ఉంటారా..? పొలిటికల్‌గా గ్యాప్ ఉన్నా.. స్నేహంలో మాత్రం ఈ ఇద్దరి మధ్యా గ్యాప్ లేదు.. ఇప్పటికీ వాళ్లు మంచి మిత్రులేనన్న టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.




