- Telugu News Photo Gallery Cinema photos Pooja Hegde's Trending Songs like Monica and Bujjamma's Success Story
Pooja Hegde: అబ్బా.. బుట్ట బొమ్మ కష్టం ఫలించింది.. ఒక్క దెబ్బకి ట్రెండింగ్‌లోకి వచ్చిన పూజా హెగ్డే
స్టార్ హీరోలతో చేసిన సినిమాలు కూడా ఇవ్వని క్రేజ్ రెండు పాటలతో వచ్చిందంటున్నారు స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే. ఆ మధ్య వరుస ఫెయిల్యూర్స్‌తో కష్టాల్లో ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు వరుస ఛార్ట్ బస్టర్స్‌తో ట్రెండింగ్‌లోకి వచ్చేశారు. ఈ క్రేజ్ మరిన్ని ఆఫర్స్ తెచ్చిపెడుతుందన్న నమ్మకంతో ఉన్నారు. ప్రజెంట్ టాప్‌లో ట్రెండ్ అవుతున్న సౌత్ సాంగ్ మోనికా. కూలీ సినిమాలో పూజ హెగ్డే ఆడి పాడిన ఈ స్పెషల్ సాంగ్, అన్ని ప్లాట్ ఫామ్స్‌లో దుమ్ము రేపుతోంది.
Updated on: Aug 17, 2025 | 5:00 PM

ప్రజెంట్ టాప్‌లో ట్రెండ్ అవుతున్న సౌత్ సాంగ్ మోనికా. కూలీ సినిమాలో పూజ హెగ్డే ఆడి పాడిన ఈ స్పెషల్ సాంగ్, అన్ని ప్లాట్ ఫామ్స్‌లో దుమ్ము రేపుతోంది. ఈ పాటలో టాప్ స్టార్స్ ఎవరు కనిపించకపోయినా.. కేవలం పూజ క్రేజ్‌తోనే ట్రెండింగ్‌లో ఉంది ఈ సాంగ్.

మోనిక పాట సక్సెస్ గురించి మాట్లాడిన పూజ హెగ్డే... షూటింగ్ టైమ్‌లోనే ఈ రేంజ్ హిట్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేశామన్నారు. ఫస్ట్ టైమ్ పాట విన్నప్పుడే ఆ వైబ్ అర్ధమైంది.

షూటింగ్ ఎక్స్‌పీరియన్స్, అవుట్‌పుట్ చూశాక ఈ సాంగ్ ఇంతపెద్ద సక్సెస్ అవుతుందని ముందే ఫిక్స్ అయ్యామన్నారు బుట్టబొమ్మ.అయితే రీసెంట్‌గా పూజ నటించిన మరో పాట కూడా అదే రేంజ్‌లో ట్రెండ్ అయ్యింది.

రెట్రో సినిమా కోసం కంపోజ్ చేసిన బుజ్జమ్మ సాంగ్ కూడా టాప్‌లో ట్రెండ్ అయ్యింది. ముఖ్యంగా ఈ పాటలో హీరో హీరోయిన్లు చేసిన హుక్ స్టెప్‌కు మిలియన్ల కొద్ది రీల్ వచ్చాయి.

షూటింగ్ టైమ్‌లోనే బుజ్జమ్మ పాట కూడా బాగానే కనెక్ట్ అయినా.. ఈ రేంజ్‌లో సక్సెస్ అవుతుందని మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయలేదున్నారు అరవింద. అందుకే ఆ సక్సెస్ తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ ట్రెండింగ్ సాంగ్స్ తన ఖాతాలో పడటం చాలా హ్యాపీగా ఉందన్నారు జిగేల్ రాణి.




