- Telugu News Photo Gallery Cinema photos Kajal Aggarwel Says Jr NTR was Her Favourte Actor In tollywood
Kajal : అతడే నా ఫేవరేట్ హీరో.. అతడి యాక్టింగ్ అంటే ఎంతో ఇష్టం.. కాజల్ అగర్వాల్..
కాజల్ అగర్వాల్.. తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకున్న ఈ హీరోయిన్.. ఇప్పుడు సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.
Updated on: Aug 17, 2025 | 1:16 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో అందాలతో గత్తరలేపుతుంది కాజల్ అగర్వాల్. ఫస్ట్ మూవీతోనే తెలుగులో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. ఆతర్వాత బ్యాక్ టూ బ్యాక్ స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంది. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకుంది.

ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన నటించిన కాజల్.. తెలుగు సినిమా ప్రపంచంలో తనదైన ముద్రవేసింది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే తన ప్రియుడు గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు నీల్ కిచ్లూ జన్మించిన సంగతి తెలిసిందే.

పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ తీసుకున్న కాజల్.. ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇటీవలే ఇండియన్ 2 చిత్రంలో నటించింది. ప్రస్తుతం తెలుగులో సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో మతిపోగొట్టేస్తుంది.

ఇదిలా ఉంటే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో కాజల్ మాట్లాడుతూ తెలుగులో తనకు ఇష్టమైన హీరో ఎవరంటే ఎన్టీఆర్ అంటూ ఠక్కున ఆన్సర్ ఇచ్చింది. తారక్ యాక్టింగ్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. వీరిద్దరు కలిసి ఇదివరకు రెండు సినిమాల్లో నటించారు.

అలాగే తనకు తమిళంలో విజయ్ దళపతి ఫేవరేట్ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు.. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ అలరిస్తుంది. తాజాగా ఈ వయ్యారి షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.




