Rajeev Rayala |
Updated on: Oct 26, 2024 | 10:13 PM
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజాహెగ్డే . జోరు తగ్గింది. ఒకానొక టైం లో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఏలిన పూజా హెగ్డే. ఆతర్వాత ఐరెన్ లెగ్ అనే పేరు తెచ్చుకుంది. ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్స్ గా నిలిచాయి.
తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది పూజా హెగ్డే.. ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ చిన్నది ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.
తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ నటించింది. పూజా హెగ్డే చేసిన సినిమాలన్నీ స్టార్ హీరోల సినిమాలే.. కానీ ఈ మధ్య కాలంలో ఈ చిన్నది చేసిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ అమ్మడు ఫ్లాప్స్ అందుకుంది.
అదే సమయంలో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఛాన్స్ మిస్ చేసుకుంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా ఛాన్స్ మిస్ చేసుకుంది. దాంతో చిన్న బ్రేక్ ఇచ్చింది.
ఇక ఇప్పుడు తిరిగి సినిమాల్లో బిజీ కావాలని చూస్తుంది. ఈ క్రమంలోనే దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీలో ఛాన్స్ అందుకుంది. గతంలో విజయ్ తో కలిసి బీస్ట్ సినిమా చేసింది పూజా.. ఇప్పుడు మరోసారి విజయ్ తో నటిస్తుంది. మరి ఈ సినిమా పూజకు ఎలాంటి హిట్ అందిస్తుందో చూడాలి.