- Telugu News Photo Gallery Cinema photos Pawan Kalyan's OG Movie Box Office Targets, Expectations and Release Hype
Pawan Kalyan: OG ముందున్న మెయిన్ టార్గెట్స్ అవే.. లెక్కలన్నీ సరి చేస్తానంటున్న పవన్
పవన్ కళ్యాణ్ ఓజి సినిమా ముందు చాలా లక్ష్యాలున్నాయి. ఒకటి రెండూ కాదు చాలా అంటే చాలా..! ఇన్నాళ్లూ తన సినిమాలతో చేయలేనివి.. చేయకుండా వదిలేసినవి.. ఇంకా చేయాల్సినవి.. అబ్బో బోలెడున్నాయి పవన్ ముందు టార్గెట్స్. మరి అవన్నీ ఓజి సినిమాతో అందుకుంటారా..? లెక్కలన్నీ సరి చేస్తారా..? అసలు ఓజి లక్ష్యాలేంటి..?
Updated on: Sep 20, 2025 | 1:36 PM

పవన్ కళ్యాణ్ మోస్ట్ హైప్డ్ సినిమా ఓజి సెన్సార్ అయిపోయింది. ఈ చిత్రానికి U/A ఇచ్చారు. అక్కడ్నుంచి అయితే అదిరిపోయే యాక్షన్ ఎంటర్‌టైనర్ అనే టాక్ వచ్చింది.

దసరా హాలీడేస్ ఉండటం.. ఏపీ ప్రభుత్వం ఏకంగా 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే వెసలుబాటు కల్పించడం.. అన్నీ ఓజికి అలా కలిసొస్తున్నాయంతే. సెప్టెంబర్ 21 ఉదయం 10.08 గంటలకు ఓజి ట్రైలర్ విడుదల కానుంది.

ఇదొచ్చాక ఎక్స్‌పెక్టేషన్స్ మరింత పెరుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే ఓజితో పవన్ చాలా లెక్కలు సరిచేయాల్సి ఉంది. స్టార్ హీరోలలో ఈయనకు మాత్రమే 100 కోట్ల ఓపెనర్ లేదు.. మొన్న హరిహర వీరమల్లు తీసుకొచ్చిన 70 కోట్ల గ్రాస్ పవన్ హైయ్యస్ట్.

ఓజి సినిమాపై ఉన్న అంచనాలకు మొదటిరోజు 100 కోట్ల గ్రాస్ అనేది పెద్ద విషయమే కాదు.. పైగా టికెట్ రేట్లపై పెంపు కూడా ఉంది. పాజిటివ్ టాక్ వస్తే.. 100 కాదు మొదటిరోజే 150 కోట్లు తెచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. OGతో పవన్ పూర్తి చేయాల్సిన మరో లక్ష్యం 100 కోట్ల షేర్ అందుకోవడం.. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ దగ్గరి వరకు వచ్చి ఆగిపోయాయి.

పవన్ ఇమేజ్ పెద్దదే కానీ.. మిగిలిన హీరోలతో పోలిస్తే పవన్ బాగా వెనక బడ్డారు. దానికి చాలా కారణాలున్నాయి. అవన్నీ ఓజితో సరి చేస్తాడంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాతో 200 కోట్ల క్లబ్‌లోకి చేరిపోవాలని చూస్తున్నారు PK. తెలంగాణలో ఇంకా రేట్లపై క్లారిటీ రాకున్నా.. ఇక్కడ కూడా బెనిఫిట్ షోస్ అనుమతులు వచ్చేలాగే ఉన్నాయి. మొత్తానికి చూడాలిక.. పవన్ ఫైర్ స్ట్రామ్ ఎలా ఉండబోతుందో..?




