- Telugu News Photo Gallery Cinema photos Pawan Kalyan Harihara Veeramallu to Rajinikanth Jailer 2 latest film from movie industry
Movie News: వీరమల్లు క్రేజి అప్డేట్.. ఫన్నీగా జైలర్ 2 సందడి..
హరి హర వీరమల్లు సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యింది. మరో లేడీ ఓరియంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పాయల్. వాడివాసల్ ప్రీ ప్రొడక్షన్ పనులు తిరిగి ప్రారంభం. అజయ్ దేవగణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సన్నాఫ్ సర్దార్ 2. షూటింగ్ స్టార్ట్ కాకముందే సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేశారు జైలర్. ఇలాంటి కొన్ని సినిమా వార్తలు తెలుసుకుందాం..
Updated on: Jan 22, 2025 | 8:35 PM

మాట వినాలి అంటూ ఈ మధ్య పవన్ కల్యాణ్ గొంతులో పాట విన్నప్పటి నుంచీ.. ఇక ఆగలేం బాసూ అని రిక్వెస్టులు మీద రిక్వెస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్. హరిహరవీరమల్లుని చెప్పిన డేట్‌కి రిలీజ్ చేయమన్నది వారి డిమాండ్.

మరో లేడీ ఓరియంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. మంగళవారం రిలీజ్ తరువాత బ్రేక్ తీసుకున్న ఈ బ్యూటీ, ముని దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నారు.

వాడివాసల్ ప్రీ ప్రొడక్షన్ పనులు తిరిగి ప్రారంభించారు దర్శకుడు వెట్రిమారన్. ఇప్పటికే యానిమాట్రిక్స్ వర్క్ పూర్తి కావటంతో కాస్టింగ్ సెట్ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమాలో సూర్యకు జోడీగా ఐశ్వర్య లక్ష్మీని తీసుకునే ఆలోచనలో ఉంది చిత్రయూనిట్.

అజయ్ దేవగణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సన్నాఫ్ సర్దార్ 2. ఈ సినిమాలో అజయ్‌కి జోడీగా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ జూలై 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంజయ్ దత్, జ్యోతీ దేశ్‌పాండే కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

షూటింగ్ స్టార్ట్ కాకముందే సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేశారు జైలర్ 2 మేకర్స్. సంక్రాంతి కానుకగా ఎనౌన్స్‌మెంట్ వీడియో రిలీజ్ చేసిన యూనిట్, తాజాగా మేకింగ్ వీడియో షేర్ చేసింది. సెట్‌లో అనిరుధ్, నెల్సన్ చేసిన అల్లరిని ఈ వీడియోలో చూపించారు.





























