- Telugu News Photo Gallery Cinema photos Pawan kalyan hari hara veeramallu release date update on 30 05 2025
రిలీజ్ డిలే అయిన.. విడుదలైతే బాక్స్ ఆఫీస్ లు బద్దలవ్వాల్సిందే..
ఫైనల్‌గా మూడేళ్ల తరువాత హరి హర వీరమల్లు రిలీజ్‌కు రెడీ అవుతోంది. అయితే ఈ డిలే సినిమా అవుట్‌పుట్ విషయంలో ఎలాంటి ప్రభావం చూపుతుందన్న టెన్షన్ ఫ్యాన్స్‌లో కనిపిస్తోంది. మరి పవన్ విషయంలో ఆలస్యం విషయమవుతుందా..? అమృతమవుతుందా..? హరి హర వీరమల్లు పవన్ కెరీర్‌లో చాలా స్పెషల్.
Updated on: May 30, 2025 | 9:32 PM

హరి హర వీరమల్లు పవన్ కెరీర్‌లో చాలా స్పెషల్. పవన్ చేస్తున్న తొలి పీరియాడిక్ మూవీ, తొలి కాస్ట్యూమ్ డ్రామా, తొలి హిస్టారికల్ మూవీ ఇలా ఎన్నో స్పెషాలిటీస్ ఉన్న ఈ ప్రాజెక్ట్ చాలా డిలే అయ్యింది.

2022లోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఫైనల్‌గా 2025 జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫోక్‌లోర్ జానర్ సినిమా, అందులోనూ భారీగా విజువల్ ఎఫెక్ట్స్ నీడ్ ఉన్న సినిమా చేయటం అంటే మామూలు విషయం కాదు.

ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు ప్రతీ విషయంలోనూ ఇబ్బందులు ఉంటాయి. అందుకే గతంలోనూ ఈ ఫార్మాట్‌లో వచ్చిన సినిమాలు రిలీజ్ విషయంలో ఆలస్యమయ్యాయి. అరుంధతి లాంటి సినిమా రిలీజ్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడాల్సి వచ్చింది.

ఆలస్యంగా రిలీజ్ అయినా... అందరికీ షాక్ ఇచ్చే రేంజ్‌లో సక్సెస్ సౌండ్ చేశాయి ఫోక్‌లోర్ మూవీస్. బాహుబలి, ట్రిపులార్ లాంటి సినిమాలు కూడా ఎన్నో వాయిదాల తరువాతే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఈ సినిమాలు క్రియేట్ చేసిన రికార్డ్‌ల గురించి దేశం మొత్తం మాట్లాడుకుంది.

ఇప్పుడు హరి హర వీరమల్లు విషయంలోనూ అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు పెద్దగా సందడి కనిపించకపోయినా... రిలీజ్ డేట్ లాక్ అయిన తరువాత బజ్ పెరుగుతోంది. ప్రతీ అప్‌డేట్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ జోరు చూస్తుంటే కంటెంట్ ఏ మాత్రం కనెక్ట్ అయినా... పవన్ రికార్డులు తిరగ రాయటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.




