- Telugu News Photo Gallery Cinema photos Tollywood heroins rashmika mandanna, sreeleela, pooja hegde waiting for upcoming movie hits
ఇండస్ట్రీ లో పేరు మాత్రం పెద్దదే.. కానీ హిట్స్ మాత్రం కరువాయే
పేరుకేం తక్కువ లేదు. కానీ, ఎటొచ్చీ.. లాస్ట్ సినిమా హిట్టా? ఫట్టా? అని ఎవరైనా అడిగితే.. హిట్టే అని గట్టిగా చెప్పలేని పరిస్థితి. మరి త్వరలో రిలీజ్‌కి రెడీ అవుతున్న సినిమాలైనా ఈ సిట్చువేషన్ నుంచి బయట పడేయాలని కోరుకుంటున్నారు మన హీరోయిన్లు కొందరు. ఇంతకీ ఎవరు వారు? రష్మిక కెరీర్ కేం? అద్భుతంగా ఉంది.. అని అనుకునేవారికి సికిందర్ సినిమాను గుర్తుచేస్తే..
Updated on: May 31, 2025 | 12:37 PM

రష్మిక కెరీర్ కేం? అద్భుతంగా ఉంది.. అని అనుకునేవారికి సికిందర్ సినిమాను గుర్తుచేస్తే.. 'అర్రే.. ఆ సినిమా ఈ మధ్యే వచ్చి పోయిందిగా...' అని అనుకుంటారు. టాప్ గేర్‌లో సాగుతున్న రష్మిక కెరీర్‌కి స్పీడ్ బ్రేక్‌లా మారింది సికిందర్.

పూజా హెగ్డేకి కూడా సల్మాన్‌తో ఫ్లాప్ సినిమా ఉంది. రీసెంట్‌గా వచ్చిన రెట్రో కూడా ఆశించినంత హిట్ కాలేదు. సో, రిలీజ్‌కి రెడీ అవుతున్న కూలీలో స్పెషల్ సాంగ్ మీదే ఉంది రెట్రో బ్యూటీ ఫోకస్.

తొలి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న నాయిక భాగ్యశ్రీ బోర్సే. తెలుగు సినిమాల్లో టాప్ కుర్చీ ఈమెకు గ్యారంటీ అనే అనుకున్నారంతా. కానీ రెప్పల్ డప్పులు సౌండ్ చేయలేదు. మిస్టర్ బచ్చన్ తుస్సుమనడంతో, గతాన్ని మర్చిపోయి, ఫోర్త్ కమింగ్ ప్రాజెక్టుల మీద ఆశలు పెట్టుకున్నారు ఈ బ్యూటీ. ఆల్రెడీ రిలీజ్ అయిన కింగ్‌డమ్ సాంగ్ జనాల్లో ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తోంది.

త్వరలో తల్లి కాబోతున్న కియారా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడి చేశారు. ఈ ఏడాది ఆమెకు గేమ్ చేంజర్ నిరాశనే కలిగించింది. అందుకే త్వరలో రిలీజ్‌కి రెడీ అవుతున్న వార్2 మీద ఆశలు పెట్టుకున్నారు. తనకు వార్2 ఎన్ని రకాలుగా స్పెషలో ఆ మధ్య ఆడియన్స్ తోనూ పంచుకున్నారు కియారా. షేర్‌షా లేడీకి నానా హైరానా ఉండకూడదంటే.. వార్2 విక్టరీ కంపల్సరీ.

కిస్సిక్ బ్యూటీ శ్రీలీల కూడా మాస్ జాతర మీద మాంఛి హోప్స్ పెట్టుకున్నారు. త్వరలోనే రిలీజ్‌కి రెడీ అవుతోందీ మూవీ. రీసెంట్‌గా నితిన్‌తో కనిపించిన రాబిన్ హుడ్ అనుకున్నంతగా ఆడలేదు. దీంతో మాస్ జాతరతో మరోసారి హల్ చల్ చేసేయాలని ఫిక్సయ్యారు ఈ బ్యూటీ.




