- Telugu News Photo Gallery Cinema photos Trisha krishnan latest comments on kamal haasan know the details here
Trisha: కమల్ ఎప్పటి నుంచో తెలుసన్న త్రిష.. ఆ మాటలతో ఇప్పుడేం పని
ఫస్ట్ టైమ్ పనిచేస్తే కొత్తగా బెరుగ్గా అనిపిస్తుంది. సెకండ్ టైమ్ కొలాబరేట్ అయినప్పుడు తెలిసిన పరిచయాలే అనిపిస్తాయి. మూడో సారి కూడా ఛాన్స్ వస్తే... వారెవా.. ఇది నా ప్లేస్ అనిపిస్తుంది. హ్యాట్రిక్ దాటి ఓ కాంబో కంటిన్యూ అవుతుందంటే దాన్ని అదృష్టం అనే అనుకోవాలంటున్నారు త్రిష... చెన్నై బ్యూటీ ఇప్పుడు ఒన్ టూ త్రీ ఫోర్ అంటూ కౌంట్ డౌన్ ఎందుకు స్టార్ట్ చేసినట్టు?
Updated on: May 31, 2025 | 12:50 PM

మణిరత్నంతో రిపీటెడ్ గా వర్క్ చేయడం చాలా స్పెషల్ అని అంటున్నారు త్రిష. తనకు ప్రిన్సెస్‌గా నటించాలనిపించినప్పుడు, పీరియడ్ ఫిల్మ్ లో కనిపించాలనిపించినప్పుడు మణిరత్నం పిలిచి పొన్నియిన్ సెల్వన్‌లో కుందవై కేరక్టర్ ఇవ్వడాన్ని మర్చిపోలేనంటున్నారు.

రీసెంట్‌గా థగ్ లైఫ్‌లో పనిచేస్తున్నప్పుడు కంఫర్టబుల్ స్పేస్‌లో ఉన్నట్టు, కుటుంబ సభ్యుల మధ్య ఉన్నట్టనిపించిందన్నారు త్రిష. కమల్ హాసన్‌తో తనకు ఎప్పటి నుంచో మంచి పరిచయం ఉందని చెప్పారు.

ఆయన తనకు మెంటర్ అన్నారు చెన్నై బ్యూటీ. శింబుతో ఇది వరకే సినిమాలు చేశానని, అందుకే శింబుని సెట్లో చూసినప్పుడల్లా అప్పటి విషయాలు మాట్లాడుకునేవాళ్లమని చెప్పారు.

చుట్టూ అంతా తెలిసిన వాతావరణం ఉంటే, ఆ రిజల్ట్ స్క్రీన్ మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుందంటున్నారు ఈ బ్యూటీ. రీసెంట్‌గా అజిత్‌తోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశారు త్రిష.

విడాముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీలో అజిత్‌తో జోడీ కట్టారు ఈ బ్యూటీ. ఇప్పుడు మెగాస్టార్‌తో విశ్వంభరలో నటిస్తున్నారు. ఆయనతోనూ ఇంతకు మునుపు స్టాలిన్‌లో నటించారు.




