Prabhas: డార్లింగ్‌తో మూవీ.. షరతులు వర్తిస్తాయి.! హీరోయిన్స్ కూడా షరతులా..
షరతులు వర్తిస్తాయి.. ప్రభాస్ సినిమాలో ఫీమేల్ లీడ్ చేయాలంటే కొన్ని షరతులు వర్తిస్తాయనే మాట ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. మేమూ బిజీ.. మీరూ బిజీ అంటే కుదరదు.. అటో, ఇటో ఎటో ఓ వైపు తేల్చుకుని ప్రాజెక్టులకు సంతకాలు చేయండనే సిగ్నల్స్ గట్టిగానే వెళ్తున్నాయట నాయికలకు.. ఇంతకీ సంగతేంటి.? కల్కి సినిమాలో ఒకరికి ఇద్దరు హీరోయిన్లతో వర్క్ చేశారు ప్రభాస్.