OG – Pawan Kalyan: కొన్ని సినిమాలపై అంచనాలు తీసేవాళ్లకు భయమేసేలా ఉన్నాయి. ఓజి పరిస్థితి అదే.!
కొన్ని సినిమాలపై ఉన్న అంచనాలు చూస్తుంటే తీసేవాళ్లకు భయమేస్తుంది. అయితే అలాంటి సినిమాలు తరుచుగా కాదు.. అరుదుగా వస్తుంటాయి. ఇప్పుడో సినిమాపై ఇలాంటి ఫోబియానే నడుస్తుంది. ఎక్కడికెళ్ళినా.. ఏం చేసినా.. ఎవరిని కదిపినా ఆ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. దాని అప్‌డేట్సే కావాలంటున్నారు. ఈ ఒక్క టీజర్ ఏడాది నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు తారకమంత్రంలా మారిపోయింది.