- Telugu News Photo Gallery Cinema photos NTR is Like God To Me, I will give my life to him Says Raghu Karumanchi Telugu Film News
Raghu Karumanchi: ఎన్టీఆర్ కోసం ప్రాణం తీయమన్నా తీసేస్తా.. మొహమాటం లేదు : రఘు
ఎన్టీఆర్ అంటే వ్యక్తి కాదు శక్తి. గొప్ప టాలెంట్ ఉన్ననటుడు. తాతకి తగ్గ మనవడు.. ఆయన వస్తేనే టీడీపీ పూర్వవైభవం వస్తుందని యాక్టర్ రఘు చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ తన బాడీలో ఒక పార్ట్‌లా మారిపోయాడని పేర్కొన్నాడు.
Updated on: Mar 11, 2023 | 5:02 PM

దాదాపు రెండు వందలకు పైగా సినిమాల్లో నటించిన కమెడియన్ రఘు తెలియని వారు ఉండరు. కెరీర్ తొలినాళ్లలో జబర్దస్త్ షోతో మంచి పాపులారిటీ పొందాడు.

తెలంగాణ యాస, భాష మాట్లాడే ఈయనది ఆంధ్రా.ఆయన సొంత ఊరు ఆంధ్రాలోని తెనాలి. రఘు తండ్రి ఆర్మీ ఆఫీసర్ కావడంతో.. అతని బాల్యం విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లోనే గడిచింది.

సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన రఘుని యాక్టర్‌గా మార్చి ఇండస్ట్రీ వైపు తీసుకుని వచ్చింది ఆయన స్నేహితుడు వివి వినాయక్.

రాజీవ్ కనకాల, రఘు, ఎన్టీఆర్.. బెస్ట్ ఫ్రెండ్స్. వీరు అప్పట్లో రెగ్యూలర్‌గా కలుస్తూ ఉండేవారు. ఇప్పుడు ఎవరికి వారు బిజీ అయిపోయారు.

కాలేజ్ డేస్ నుండి రౌడీయిజం చేసేవాడినని తాజా ఇంటర్వ్యూలో చెప్పాడు రఘు. తన ఫ్రెండ్ ఎన్టీఆర్ జోలికొస్తే చంపడానికైనా చావడానికైనా రెడీ అంటున్నాడు.

"తారక్ కోసం ప్రాణం ఇవ్వడమే కాదు.. ఎవడి ప్రాణం తీయమన్నా తీసేస్తా. పలానా వాడు ఇలా అన్నాడని చెప్తే.. రేపటికల్లా ఆ ప్రాణం ఉండదు. తీసేస్తా.. అందులో ఎలాంటి మొహమాటం లేదు. ఎన్టీఆర్ జోలికి ఎవరు వచ్చినా ప్రాణం తీసేయడమే. నాకు అతనంటే అంత ఇష్టం.. ప్రేమ. ఆయన కోసం చావడానికైనా.. చంపడానికైనా సిద్ధమే" అని రఘు చెపుకొచ్చాడు.




