- Telugu News Photo Gallery Cinema photos Nivetha thomas latest onam photos goes viral on social media
చబ్బీ లుక్స్‌తో చంపేస్తున్నా నివేద థామస్.. ఫొటోస్ అదిరిపోయాయిగా..
1995 నవంబర్ 2న కన్నూర్ ప్రాంతంలో జన్మించిన నివేదా.. 2002లో మలయాళం మూవీ ‘ఉత్తర’లో బాలనటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత సన్ టీవీలో అప్పట్లో ప్రసారమైన మై డియర్ భూతం సీరియల్లోనూ నివేద నటించింది. ఆ తర్వాత తమిళ్, మలయాళంలో అనేక చిత్రాల్లో సహాయ నటిగా కనిపించింది.
Updated on: Sep 08, 2025 | 9:17 PM

1995 నవంబర్ 2న కన్నూర్ ప్రాంతంలో జన్మించిన నివేదా.. 2002లో మలయాళం మూవీ ‘ఉత్తర’లో బాలనటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత సన్ టీవీలో అప్పట్లో ప్రసారమైన మై డియర్ భూతం సీరియల్లోనూ నివేద నటించింది. ఆ తర్వాత తమిళ్, మలయాళంలో అనేక చిత్రాల్లో సహాయ నటిగా కనిపించింది.

2016లో న్యాచురల్ స్టార్ నాని నటించిన జెంటిల్మెన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత నిన్ను కోరి, జై లవకుశ, 118, బ్రోచేవారెవరురా, దర్బార్, వి, వకీల్ సాబ్, మీట్ క్యూట్, శాకిని డాకిని, 35 చిత్రాలతో తెలుగు ఆడియెన్స కు బాగా చేరువైంది.

తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. అందం, అభినయంతో సినీప్రియులను కట్టిపడేసింది. అయితే ఈ బ్యూటీకి మంచి ఇమేజ్ వచ్చినప్పటికీ అవకాశాలు మాత్రం అంతగా రాలేదు.

ఇటీవలే 35 చిన్న కథ అనే సినిమాలో తల్లి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. ఇన్నాళ్లు గ్లామర్ హీరోయిన్ గా కనిపించిన నివేదా.. తల్లి పాత్రలో నటించి మార్కులు కొట్టేసింది. ఇందులో తన పాత్రకు గానూ ఉత్తమ నటిగా గద్దర్ అవార్డ్ అందుకుంది. ఈ అవార్డ్ వేడుకలలో నివేదా లుక్ చూసి ఆశ్చర్యపోయారు నెటిజన్స్.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది.. రెగ్యులర్ గా తన ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా నివేదా ఓనం ఫోటోలను పంచుకుంది. చీరకట్టులో అదరగొట్టింది నివేదా. ఈ ఫొటోల్లో ఎంతో గ్లామరస్ గా కనిపించింది నివేదా. ఈ ఫోటోల పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.




