- Telugu News Photo Gallery Cinema photos Nidhhi Agerwal Says She Watches Murdery Mystery Movie Every Night
Tollywood: నిధి అగర్వాల్‌కు వింత అలవాటు.. ప్రతి రోజు రాత్రి ఆ సినిమాలు చూడాల్సిందేనంట..
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్ నిధి అగర్వాల్. ఇప్పటివరకు నటించిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి. కేవలం ఇస్మార్ట్ శంకర్ సినిమా మాత్రమే బాక్సాఫీస్ వద్ద మెప్పించింది. అయినప్పటికీ ఈ బ్యూటీకి వరుస స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. తాజాగా తన లైఫ్ స్టైల్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇంతకీ ఏం చెప్పిందంటే..
Updated on: Jun 27, 2025 | 12:17 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం బిజీగా ఉన్న హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. కెరీర్ మొదటి నుంచి ఈ అమ్మడు నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ రామ్ పోతినేని సరసన ఈ బ్యూటీ నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా మాత్రమే హిట్టయ్యింది. ఆ తర్వాత తమిళంలో పలు చిత్రాల్లో నటించినప్పటికీ సరైన బ్రేక్ రాలేదు.

కానీ ఇప్పుడు ఈ అమ్మడు వరుసగా అగ్ర హీరోల సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ జోడిగా రాజాసాబ్ చిత్రంలో నటిస్తుంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హరి హర వీరమల్లు చిత్రంలో నటిస్తుంది. ఈ రెండు సినిమాలు త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది.

కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు ఫుల్ యాక్టివ్. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా తన ఫాలోవర్లతో చిట్ చాట్ నిర్వహించింది. ఈ క్రమంలోనే తనకు ప్రతి రోజూ రాత్రి మర్డర్ మిస్టరీ సినిమాను చూస్తానని.. కొత్త కంటెంట్ దొరకడం లేదని.. ప్లీజ్ తనకు కొన్ని సూచనలు ఇవ్వండి అంటూ రాసుకొచ్చింది.

మర్డర్ మిస్టరీ సినిమా ఏ భాష అయిన సరే చేస్తానని తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ అమ్మడు షేర్ చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుండగా.. నెటిజన్స్ క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు. తెలుగులో ఇటీవల విడుదలైన సినిమాలు చూడాలన చెబుతున్నారు. ఇటీవల నిజ జీవితంలో జరిగిన మేఘాల హానీమూన్ కేసు, తేజేశ్వర్ మర్డర్ కేసు గురించి చదవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

నిధి అగర్వాల్.. ఇప్పుడు సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. ఇప్పటివరకు ఈ అమ్మడు నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. దీంతో ఈ బ్యూటీ ఆశలన్నీ ఇప్పుడు రాజాసాబ్, హరిహర వీరమల్లు సినిమాలపైనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.




