- Telugu News Photo Gallery Cinema photos Do you Know This Actress Once a child artist And she was a sensation as a heroine, She is Kavya Kalyan Ram
Tollywood: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. హీరోయిన్గా సెన్సేషన్.. బ్లాక్ బస్టర్స్ అయినా అవకాశాలకు దూరం..
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా టాలీవుడ్ సినీప్రియులను అలరించింది. తెలుగులో ఎన్నో సినిమాల్లో బాలనటిగా కనిపించి మెప్పించింది. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత చదువుల కోసం సినిమాలకు దూరమైన ఈ అమ్మడు..ఇప్పుడు హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. కానీ ఈ బ్యూటీకి అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు. ఇంతకీ ఆమె ఎవరంటే..
Updated on: Jun 27, 2025 | 11:39 AM

టాలీవుడ్ సినీప్రియులకు పెద్దగా అవసరంలేని పేరు. చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అగ్ర హీరోల సినిమాల్లో బాలనటిగా కనిపించింది. ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో అలరించింది. ఆ తర్వాత చదువుల కోసం ఇండస్ట్రీకి దూరమైన ఈ అమ్మడు.. ఇప్పుడు కథానాయికగానూ సత్తా చాటింది. చాలా కాలం తర్వాత హీరోయిన్గా తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది.

ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ కథానాయికగా మెప్పించింది. తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. అయినప్పటికీ నెమ్మదిగా ఈ అమ్మడుకు అవకాశాలు తగ్గిపోయాయి.ఇంతకీ ఈ వయ్యారి ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్.

చైల్డ్ ఆర్టిస్టుగా దాదాపు పదకొండు సినిమాల్లో నటించింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన గంగోత్రి సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మసూద సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తర్వాత వేణు దర్శకత్వం వహించిన బలగం సినిమాతో మరో సక్సెస్ అందుకుంది.

ఆ తర్వాత పలు సినిమాల్లో కనిపించింది. శ్రీసింహా నటించిన ఉస్తాద్ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత మరో సినిమా రాలేదు. ఆమె సినిమా చేసి దాదాపు రెండేళ్లవుతుంది. అయితే ఈ అమ్మడుకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయినట్లు తెలుస్తోంది.

కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది కావ్య కళ్యాణ్ రామ్. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంటుంది. అటు చీరకట్టులో.. ఇటు మోడ్రన్ డ్రెస్సులలో గ్లామర్ ఫోజులతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా కావ్య కళ్యాణ్ రామ్ క్రేజీ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి




