- Telugu News Photo Gallery Cinema photos Sangeerthana Vipin latest charming looks in pink saree goes viral in social media
Sangeerthana Vipin: ఈ అరుదైన అందాల ఆమని స్పర్శకై జాబిల్లి తపస్సు చేస్తుంది.. చార్మింగ్ సంగీర్తన..
సంగీర్తన విపిన్.. జనక అయితే గనక సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈ భామ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినిమాలో ఈమెని చూసిన తెలుగు కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈ ముద్దుగుమ్మషేర్ చేసిన ఫోటోలను చుసిన వారంతా గార్జియస్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆ ఫోటోలు మీరు కూడా ఓసారి చుడండి మరి.
Updated on: Jun 27, 2025 | 11:07 AM

6 నవంబర్ 2002న కేరళలోని కాసర్‌గోడ్ జిల్లా నీలేశ్వర్‌లో జన్మించింది అందాల సుకుమారి సంగీర్తన విపిన్. ఈమె తల్లిదండ్రులు విపిన్, సీమ. 2023లో వచ్చిన హిగుయిటా అనే ఓ మలయాళీ పొలిటికల్ చిత్రంతో కథానాయికగా చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ కేరళ కుట్టి.

అదే ఏడాది ఆమె తెలుగు చిత్రం నరకాసురలో కనిపించింది. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ క్యూటీ. 2024లో సోలై ఆరుముగం దర్శకత్వం వహించిన కాడువెట్టి అనే సినిమాతో తొలిసారి తమిళంలో నటించింది ఈ ముద్దుగుమ్మ.

గత ఏడాది ఆమె రెండు తెలుగు చిత్రాల్లో నటించింది. అవే ఆపరేషన్ రావణ్, సుహాస్ హీరోగా వచ్చిన జనక అయితే గనక. బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్న జనక అయితే గనక సినిమాలో తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.

దీని తర్వాత ఈ బ్యూటీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ విపరీతంగా పెరుగుపోయింది. తెలుగు కుర్రాళ్ల క్రష్ లిస్టులో చేరిపోయింది ఈ భామ. దీంతో తెలుగులో ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు వస్తున్నాయి.

ప్రస్తుతం తెలుగులో అసురగణ రుద్ర అనే సినిమా చేస్తుంది ఈ వయ్యారి. తాజాగా పయనం అనే మరో తెలుగు చిత్రానికి సైన్ చేసింది ఈ మలయాళీ భామ. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.




