- Telugu News Photo Gallery Cinema photos Interesting facts about Kannappa movie actress Preity Mukhundhan, See her latest photos
Kannappa Movie: బీటెక్ పూర్తి చేసి.. భరత నాట్యం నేర్చుకుని.. కన్నప్ప సినిమా హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ ఇదే.. ఫొటోస్
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా ఈ రోజు (జూన్ 27) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు హిందీ తదితర భాషల్లోనూ ఈ సినిమా రిలీజైంది. కాగా ఈ సినిమాలో నెమలి అనే రాకుమార్తెగా ప్రీతి ముకుందన్ నటించింది.
Updated on: Jun 27, 2025 | 1:01 PM

మంచు విష్ణు కన్నప్ప సినిమాలో కథానాయికగా తమిళ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ నటించింది. ఇది ఆమెకు రెండో తెలుగు సినిమా. గతంలో ప్రీతి ముకుందన్ శ్రీ విష్ణు నటించిన ఓం భీమ్ బుష్ సినిమాలో నటించింది.

తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన ప్రీతి ముకుందన్ చిన్నప్పుడే భరతనాట్యం నేర్చుకుంది. హిప్‌హాప్ నృత్యంలోనూ ప్రావీణ్యం సొంతం చేసుకుంది. ఇక చదువు విషయానికి వస్తే బీటెక్ పూర్తి చేసింది.

కాలేజీ రోజుల్లో మోడలింగ్ చేసింది ప్రీతి. ఈ క్రమంలోనే పలు వాణిజ్య ప్రకటనల్లోనూ నటించింది. ఇక సినిమాల్లోకి రాక ముందు కొన్ని ఆల్బమ్ సాంగ్స్, మ్యూజిక్ వీడియోల్లోనూ నటించి మెప్పించింది ప్రీతి ముకుందన్.

ప్రీతి నటించిన మొదటి మ్యూజిక్ ఆల్బమ్ ‘ముత్తు ము2’. యూట్యూబ్‌లో ఈ ఆల్బమ్‌కు దాదాపు 6 మిలియన్స్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక ఓం భీమ్ బుష్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైందీ అందాల తార. ఈ మూవీలో ఆమె జలజ అనే పాత్రలో ఆకట్టుకుంది ప్రీతి.

ఓం భీమ్ బుష్' తర్వాత ప్రీతి చేసిన మ్యూజిక్ వీడియో 'ఆశ కూడ' ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. అలాగే బాలీవుడ్ ప్రముఖ ర్యాపర్ బాద్షా 'మోర్నీ' మ్యూజిక్ వీడియోలోనూ సందడి చేసిందీ అందాల తార.

ఇప్పుడు కన్నప్ప సినిమాతో మరోసారి తెలుగు ఆడియెన్స్ ను పలకరించేందుకు రెడీ అయ్యింది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.




