- Telugu News Photo Gallery Cinema photos Nayanthara giving interviews in new trend, Kriti Sanon on rumours about her tie up trading companies
అటు నయన్.. ఇటు కృతి.. ‘మార్పు మంచిదేనంటున్న అభిమానులు..
ఇప్పటిదాకా మనం చూసింది వీళ్లనేనా అంటూ ఆశ్చర్యపోతున్నారు జనాలు. మన దగ్గర నయనతార, నార్త్ లో కృతి సనన్ ఇప్పుడు జనాలకు షాకుల మీద షాకులిస్తున్నారు. ఉన్నపళాన వారి ప్రవర్తనలో వచ్చిన మార్పులేంటి? వారిని చూసిన జనాలు ఎందుకు అవాక్కవుతున్నారు? మనం కూడా చూసేద్దాం రండి.... నయనతార అనే పేరు చెప్పగానే... ఆమె ప్రమోషన్లకు దూరంగా ఉంటారండీ అనే మాట చిన్న పిల్లలు కూడా చెప్పేస్తారు. అయితే నయన్ విషయంలో అదంతా నిన్నటి సంగతి. జవాన్ నుంచీ ఆమె బిహేవియర్‌లో చెప్పుకోదగ్గ మార్పు కనిపిస్తోంది.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Dec 07, 2023 | 6:45 PM

ఇప్పటిదాకా మనం చూసింది వీళ్లనేనా అంటూ ఆశ్చర్యపోతున్నారు జనాలు. మన దగ్గర నయనతార, నార్త్ లో కృతి సనన్ ఇప్పుడు జనాలకు షాకుల మీద షాకులిస్తున్నారు. ఉన్నపళాన వారి ప్రవర్తనలో వచ్చిన మార్పులేంటి? వారిని చూసిన జనాలు ఎందుకు అవాక్కవుతున్నారు? మనం కూడా చూసేద్దాం రండి....

నయనతార అనే పేరు చెప్పగానే... ఆమె ప్రమోషన్లకు దూరంగా ఉంటారండీ అనే మాట చిన్న పిల్లలు కూడా చెప్పేస్తారు. అయితే నయన్ విషయంలో అదంతా నిన్నటి సంగతి. జవాన్ నుంచీ ఆమె బిహేవియర్‌లో చెప్పుకోదగ్గ మార్పు కనిపిస్తోంది. ఆ మాట కొస్తే జవాన్‌కి ముందు నుంచే... పెళ్లయినప్పటి నుంచే లేడీ సూపర్‌స్టార్‌లో ఇంట్రస్టింగ్ చేంజ్ కనిపిస్తోంది.

ఇన్నాళ్లూ సినిమా ప్రమోషన్లకు దూరంగా, అవార్డు వేడుకలకు మాత్రం దగ్గరగా కనిపించేవారు నయన్. అయితే ఈ మధ్య సినిమా రిలీజులకు ముందు కంఫర్టబుల్ హోస్ట్ ని సెలక్ట్ చేసుకుని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. రీసెంట్ రిలీజ్ అన్నపూరణి విషయంలో మరో అడుగు ముందుకేసి, ఓ కాలేజీలో అమ్మాయిలకు బిర్యానీ సర్వ్ చేశారు నయన్.

నయనతార జనాలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుంటే, సిల్వర్ స్క్రీన్ జానకి కృతి సనన్ దూరంగా జరుగుతున్నారనే మాట వినిపిస్తోంది. కాంట్రవర్శీలకు ఎప్పుడూ దూరంగా ఉంటే కృతి ఈ మధ్య తన మనసులోని మాటలను నిర్భయంగా చెప్పేస్తున్నారు.

ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ ని ప్రోత్సహించినట్టే, ఔట్ సైడర్స్ ని కూడా ఎంకరేజ్ చేయాలని ఆ మధ్య చెప్పిన కృతి, ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేశారు. తాను చెప్పనిదాన్ని చెప్పినట్టు, ట్రేడింగ్ కంపెనీలతో తనకు సంబంధం ఉన్నట్టు పేర్కొన్న వారి మీద చర్యలు తీసుకుంటున్నారు. ఫర్‌దర్‌గానూ తనజోలికి ఎవరైనా వస్తే, లీగల్‌గా ప్రొసీడ్ అవతానని అంటున్నారు కృతి. నయన్ అలా... కృతి ఇలా అంటూ పోల్చి చూస్తున్నారు ఆడియన్స్.





























