ట్రెండ్‌ను పాడు చేస్తోన్న ‘రీ-రిలీజ్‌’లు.. ముఖం చాటేస్తున్న ఫ్యాన్స్.. 

ఎవడడిగాడ్రా నిన్ను.. పోకిరి సినిమాలో బ్రహ్మానందంతో అలీ చెప్పే ఈ డైలాగ్ గుర్తుందిగా..! ఇప్పుడు కొందరు నిర్మాతలను ఇదే ప్రశ్న అడుగుతున్నారు అభిమానులు. కాకపోతే మరి అలీలా కాకుండా కాస్త మర్యాదపూర్వకంగా అడుగుతున్నారంతే. అసలెవరు అడిగారు మిమ్మల్ని అంటూ నిలదీస్తున్నారు. అసలు దేనికి ఈ అలక.. ఎందుకు వాళ్ళు ప్రశ్నలపర్వం కొనసాగిస్తున్నారు..? మొత్తం మ్యాటర్ ఒక్క స్టోరీలో చూసేద్దాం పదండి.. ఈ మధ్య కాలంలో కొత్త సినిమాల కంటే పాత సినిమాలే ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Phani CH

Updated on: Dec 07, 2023 | 6:15 PM

ఎవడడిగాడ్రా నిన్ను.. పోకిరి సినిమాలో బ్రహ్మానందంతో అలీ చెప్పే ఈ డైలాగ్ గుర్తుందిగా..! ఇప్పుడు కొందరు నిర్మాతలను ఇదే ప్రశ్న అడుగుతున్నారు అభిమానులు. కాకపోతే మరి అలీలా కాకుండా కాస్త మర్యాదపూర్వకంగా అడుగుతున్నారంతే. అసలెవరు అడిగారు మిమ్మల్ని అంటూ నిలదీస్తున్నారు. అసలు దేనికి ఈ అలక.. ఎందుకు వాళ్ళు ప్రశ్నలపర్వం కొనసాగిస్తున్నారు..? మొత్తం మ్యాటర్ ఒక్క స్టోరీలో చూసేద్దాం పదండి..

1 / 5
ఈ మధ్య కాలంలో కొత్త సినిమాల కంటే పాత సినిమాలే ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. మొదట్లో వాటికి వచ్చిన రెస్పాన్స్ చూసి మిగిలిన నిర్మాతలు కూడా ఆసక్తి చూపించారు. కానీ రాను రాను స్టార్ హీరోల సినిమాలపై కూడా అభిమానులకు ఆసక్తి తగ్గిపోతుంది. అనవసరంగా వాళ్ళ కల్ట్ సినిమాలు మళ్లీ విడుదల చేసి పాడు చేస్తున్నారని ఫీలవుతున్నారు ఫ్యాన్స్.

2 / 5
తాజాగా రజినీకాంత్ ముత్తు సినిమా విషయంలోనూ ఇదే జరుగుతుంది. 1995లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో తెలుగు, తమిళంలో విజయం సాధించింది. డిసెంబర్ 12న రజినీ పుట్టినరోజు ఉండటంతో.. వారం ముందే ముత్తును రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు. కానీ రెస్పాన్స్ దారుణంగా వచ్చింది. ఒక్క టికెట్ కూడా అమ్ముడు కాకపోవడంతో.. తెలుగు వర్షన్ షోస్ అన్నీ క్యాన్సిల్ చేయక తప్పలేదు.

3 / 5
మొన్నే జైలర్ బ్లాక్‌బస్టర్ కావడంతో.. ముత్తుకు కూడా కచ్చితంగా రెస్పాన్స్ బాగుంటుందని నమ్మారు నిర్మాతలు. కానీ ఈ సినిమాను చూడ్డానికి ఆడియన్స్ ఎవరూ ఆసక్తి చూపలేదు. దాంతో అక్కడ సూపర్ స్టార్ ఉన్నా.. ముత్తు తోక ముడవక తప్పలేదు. ఈ మద్యే శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా విషయంలో చిరంజీవికి కూడా ఈ చేదు అనుభవం తప్పలేదు.

4 / 5
20 ఏళ్లుగా దాచేసిన ఓ పాటను మొన్న శంకర్ దాదా ఎంబిబిఎస్ రీ రిలీజ్‌లో యాడ్ చేసారు మేకర్స్. అయినా కూడా నో రెస్పాన్స్. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ అయితే కనీసం రీ రిలీజ్ అయిన సంగతి కూడా ప్రేక్షకులకు గుర్తు లేదు. ఇలా కల్ట్ సినిమాలు మళ్లీ విడుదల చేసి.. అనవసరంగా హీరోల పరువు తీస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు అభిమానులు. మరి ఇప్పటికైనా ఈ ట్రెండ్ ఆగుతుందో లేదో చూడాలి.

5 / 5
Follow us