- Telugu News Photo Gallery Cinema photos Nandamuri Balakrishna Birthday: Trivikram Attends NBK 109 Launch Here is Photos
NBK 109: బర్త్ డే సందర్భంగా బాలయ్య కొత్త మూవీ లాంచ్.. నిర్మాత త్రివిక్రమ్ సతీమణి సౌజన్య
కెరీర్‌లో ప్రజంట్ పీక్ స్టేజ్‌లో ఉన్నారు బాలయ్య. ఒకవైపు హీరోగా వరస విజయాలు అందుకుంటూ.. మరోవైపు ఓటీటీ హోస్ట్‌గా అన్‌స్టాపబుల్ అంటూ రెండు సీజన్స్ కంప్లీట్ చేశారు. నేడు ఆయన జన్మదినం. దీంతో సెలబ్రేషన్స్ ఓ రేంజ్‌లో చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ సందర్భంగా బాలయ్య 109వ చిత్రం కూడా లాంఛనంగా ప్రారంభమైంది.
Updated on: Jun 10, 2023 | 3:07 PM

బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) డైరెక్షన్‌లో NBK 109 తెరకెక్కనుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సూర్యదేవర నాగవంశీతో పాటు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

సినిమా ఓపెనింగ్‌కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా విచ్చేశారు. ఇద్దరూ మాట్లాడుకుంటున్న ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.

ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్ కుమారులలో ఒకరైన నందమూరి రామకృష్ణ, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలలో ఒకరైన వై. రవి శంకర్ తదితరులు హాజరయ్యారు.

వరసగా మాస్ సినిమాలు చేస్తున్నారు బాలయ్య. ఈ చిత్రం కూడా అదే కోవలో ఉంటుందని ప్రీ లుక్‌ని బట్టి అర్థమవుతుంది.

బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా నేడు 'భగవంత్ కేసరి' టీజర్ కూడా విడుదల అయ్యింది. అది కూడా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.





























