- Telugu News Photo Gallery Cinema photos Actor Nandamuri Balakrishna's Rare Photos With Family and Film Industry on his Birthday Special telugu cinema news
Balakrishna Birthday: బాలకృష్ణ బర్త్ డే స్పెషల్.. నందమూరి నటసింహం అరుదైన ఫోటోస్..
దివంగత నాయకుడు నందమూరి తారకరామారావు నటవారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు హీరో నందమూరి బాలకృష్ణ. అతి తక్కువ సమయంలోనే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. తారకరామారావు తనయుడిగానే కాకుండా.. నటుడిగా స్టార్ డమ్ అందుకోవడమే కాదు.. ఆనతి కాలంలోనే తన నటనకు ప్రశంసలు అందుకున్నారు.
Updated on: Jun 10, 2023 | 1:20 PM

దివంగత నాయకుడు నందమూరి తారకరామారావు నటవారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు హీరో నందమూరి బాలకృష్ణ. అతి తక్కువ సమయంలోనే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.

తారకరామారావు తనయుడిగానే కాకుండా.. నటుడిగా స్టార్ డమ్ అందుకోవడమే కాదు.. ఆనతి కాలంలోనే తన నటనకు ప్రశంసలు అందుకున్నారు.

తాతమ్మ కల సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన బాలయ్య.. ఆ తర్వాత రామ్ రహీమ్, రౌడీ రాముడు కొంటే కృష్ణుడు వంటి చిత్రాల్లో నటించారు. అయితే మంగమ్మగారి మనవడు సినిమా బాలకృష్ణకు బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి.

డైరెక్టర్ కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్ గా నిలిచింది. అలాగే లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, బొబ్బిలి సింహం సినిమాలు చేస్తూనే మరోవైపు భైరవద్వీపం వంటి పౌరాణిక చిత్రాల్లో నటించారు.

ఇవే కాకుండా సమరసింహా రెడ్డి, నరసింహా నాయుడు, చెన్నకేశవరెడ్డి వంటి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాల్లో నటించారు.

అత్యధిక చిత్రాల్లో ద్విపాత్రాభినయం పోషించిన హీరోగా బాలయ్యకు రికార్డు ఉంది. 17 సినిమాల్లో ఆయన డ్యూయల్ రోల్ ప్లే చేశారు. ‘అధినాయకుడు’గా త్రిపాత్రాభినయంలో కనిపించారు.

1987లో.. బాలయ్య సినిమాలు 8 విడుదలవడం ఓ విశేషమైతే.. అవన్నీ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టడం మరో విశేషం. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో అత్యధికంగా 13 చిత్రాల్లో నటించారాయన.

తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి 10కిపైగా సినిమాల్లో కనిపించారు. చెంఘీజ్‌ఖాన్, గోన గన్నారెడ్డి పాత్రలో నటించాలనేది ఆయన చిరకాల కోరిక.

బాలకృష్ణ బర్త్ డే స్పెషల్.. నందమూరి నటసింహం అరుదైన ఫోటోస్..




