TV9 Telugu Digital Desk | Edited By: Rajeev Rayala
Updated on: Jul 18, 2021 | 6:01 AM
నభా నటేష్.. చూస్తూ ఉండిపోవాలనిపించే రూపం ఈ ముద్దుగుమ్మది.. క్యూట్ లుక్స్ తో కుర్రాళ్లను గుర్రాల్లా కట్టిపడేసింది ఈ బ్యూటీ.
సుధీర్ బాబు నటించిన నన్ను దోచుకుందువటే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది నభా నటేష్.
ఆ సినిమా తర్వాత ఏకంగా డైనమిక్ డైరెక్టర్ పూరీ డైరెక్షన్ ల చేసే ఛాన్స్ కొట్టేసింది. రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించింది నభా .
ఈ సినిమాలో తన అందాలతో కుర్రాళ్ళ మతులు పోగొట్టింది ఈ చిన్నది. అందం అభినయంతో ఆకట్టుకుంది నభా నటేష్.
ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఈ అమ్మడు పలు సినిమాల్లో నటించింది, రవితేజకు జోడీగా డిస్కోరాజా, సాయి తేజ్ సరసన సోలోబ్రతుకే సో బెటర్ సినిమాల్లో చేసింది.
అయితే ఇస్మార్ట్ శంకర్ లాంటి హిట్ ను మాత్రం అందుకోలేక పోయింది. నిజానికి రామ్ సినిమా తర్వాత ఈ ముద్దగుమ్మ బిజీ అయిపోతుందని అంతా అనుకున్నారు.
కానీ ఈ అమ్మడికి ఆఫర్లు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. కానీ వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం నితిన్ నటిస్తున్న మాస్ట్రో సినిమాలో చేస్తుంది నభా నటేష్.
ఈ సినిమాతో మరోసారి మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తుంది ఈ కుర్రది. మరి ఈ సినిమా ఎంతటి విజయం సాధిస్తుందో చూడాలి.